I Should Have Been Picked In IPL Final: Harbhajan భజ్జీ ఏడుపు అందుకు కాదంట.. మరీ..?

Harbhajan singh says he should have been picked to play ipl 2017 final

mumbai indians, rising pune super gaints, harbhajan singh, mahendra singh dhoni,gautam gambhir,ravichandran ashwin, indian premier league 2017, IPL-10, cricket

Off-spinner Harbhajan Singh believes he should have been in the playing XI for the Mumbai Indians (MI) in the Indian Premier League (IPL) Play-offs and the final against Rising Pune Supergiant (RPS).

భజ్జీ ఏడుపు అందుకు కాదంట.. మరీ..?

Posted: 05/25/2017 06:16 PM IST
Harbhajan singh says he should have been picked to play ipl 2017 final

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో తనకు స్థానం దక్కకపోవడం పట్ల తాను ఏడవడం లేదని అది.. తనను ఎంతమాత్రం నిరాశకు గురి చేయలేదని తాజాగా స్పష్టం చేసిన టీమిండియా టర్బనేటర్ హర్భజన్ సింగ్ తనను తాను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ దోనితో పోల్చుకుని మాత్రం ఏడుస్తున్నాడని మాత్రం చెప్పకనే చెప్పాడు. ముంబె ఇండియన్స్ జట్టులో తనకు ఫైనల్ మ్యాచ్ లో స్థానం దక్కుతుందని తొలుత ఆశించినట్లు భజ్జీ తెలిపాడు.

ఫైనల్ మ్యాచ్ లో సెలక్టర్లు చోటు కల్పించకపోవడంపై తానేమి నిరాశకు గురికాలేదని అన్నాడు. అయితే టీమిండియాలో ఐసిసి ఛాంఫియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో మాత్రం.. మహేంద్రసింగ్ ధోనికి కల్పించినట్లుగా తనకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే తనను అధికంగా బాధిస్తుందని అన్నారు. తాను టీమిండియాకు 19 ఏళ్లకు సేవలు అందిస్తున్నానని, రెండు ప్రపంచ కప్ లు సాధించడంలోనూ తన పాత్ర వుందని పేర్కోన్నాడు. ధోనిని మాత్రమే వాటి గుర్తింపును వర్తింపజేస్తూ.. మరికోందరికి మాత్రం రిక్తహస్తాలను చూపడం సరైందికాదని భజ్జీ అవేదన వ్యక్తం చేశాడు.

టీమ్ సెలెక్షన్ నిజాయతీగా జరిగిందని తాను భావించడం లేదని అరోపించాడు భజ్జీ. ధోనీ ఫామ్ లో ఉన్నా, లేకపోయినా జట్టులో అతన్ని ఎంపిక చేస్తారని చెప్పాడు. గత కొంత కాలంగా ధోనీ బ్యాటింగ్ గొప్పగా ఏమీ లేదని... అయితే మాజీ కెప్టెన్ కావడంతో అనుభవంతో జట్టును ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ధోనీకి ఉందని చెప్పాడు. మిడిల్ ఆర్డర్ లో ధోనీ అనుభవం యువ క్రికెటర్లకు తోడ్పడుతుందని అన్నాడు. అయితే, ధోనీకి ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వనందుకు బాధగా ఉందని భజ్జీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harbhajan Singh  IPL-10  mumbai indians  indian premier league 2017  cricket  

Other Articles