డబుల్ సెంచరీల రికార్డులను మ్రోగించిన అజహార్ అలి Azhar Ali sets double-ton benchmarks

Azhar ali rewrites record books with historic double ton vs australia

Azhar Ali, Pakistan national cricket team, Australia national cricket team, Australia vs Pakistan, Melbourne, Sohail Khan, David Warner, Younis Khan

Azhar Ali rewrote the record books as he smashed a double century to help Pakistan reach 443/9 declared on the third day of the Melbourne Test against Australia.

అజహార్ అలి డబుల్ సెంచరీల రికార్డు..

Posted: 12/28/2016 06:46 PM IST
Azhar ali rewrites record books with historic double ton vs australia

ప్రపంచ క్రికెట్ లో దూకుడుగా వ్యవహరించే ఆస్ట్రేలియాతో అన్ని జట్టు కొంత నిదానంగా అడతాయనడంలో సందేహం లేదు. ఇటీవలే దక్షిణాఫ్రికా చేతిలో ఖంగుతిన్న అసీస్ కు తామేంటో చూపుతామన్న దిశగా పాకిస్థాన్ కూడా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో అసీస్ తో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అసీస్ పై ఘనమైన రికార్డులను నమోదు చేసుకున్నాడు.

364 బంతుల్లో 205 పరుగులు సాధించి డబుల్ సెంచరీ నమోదు చేసిన అజహర్ అలీ మెల్ బోర్న స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన రెండో ఆటగాడిగా కూడా రికార్డును లిఖించాడు. గతంలో పాక్ ఆటగాడు మాజిద్ ఖాన్ 158 పరుగులను ఈ ఇన్నింగ్స్ లో అజహర్ అలీ అధిగమించాడు. 1984లో వెస్డిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ చేసిన 208 పరుగులే ఇక్కడ అత్యధికం, కాగా అజహార్ అలి 205 పరుగులను సాధించాడు. వీటితో పాటు ఒకే ఏఢాదిలో రెండు పర్యాయాలు డబుల్ సెంచరీ చేసిన అటగాడిగా కూడా అలీ తన పేరున రికార్డును నమోదు చేసుకున్నాడు.

139 ఓవర్ నైట్ స్కోరుతో ఉన్న అజహర్ అలీ వేగంగా ఆడి పరుగులు సాధించాడు. సోహైల్ ఖాన్‌(65 బంతుల్లో 65: 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సోహైల్ రనౌట్ కావడం, ఆ వెంటనే రియాజ్‌ను హాజెల్‌వుడ్ ను ఔట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ హాఫ్ సెంచరీ (50) చేశారు. బర్డ్‌, హాజెల్‌వుడ్‌కు చెరో మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్, స్పిన్నర్ లియాన్‌ లకు ఒక వికెట్ పడగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Azhar Ali  Australia vs Pakistan  Sohail Khan  David Warner  Melbourne  cricket  

Other Articles