పాకిస్థాన్ పై డేవిడ్ వార్నర్ వీరవిహారం.. David Warner century buoys Australia after Azhar Ali 205*

David warner century buoys australia after azhar ali 205

David Warner, Azhar Ali, Australia national cricket team, Pakistan national cricket team, Australia vs Pakistan, Usman Khawaja, Melbourne

A run-a-ball hundred from David Warner gave Australia an outside chance of forcing a result after Azhar Ali posted a double-century for Pakistan in the second Test in Melbourne

పాకిస్థాన్ పై డేవిడ్ వార్నర్ వీరవిహారం..

Posted: 12/28/2016 06:49 PM IST
David warner century buoys australia after azhar ali 205

పాకిస్తాన్‌తో మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వీరవిహారం చేశాడు. పాకిస్తాన్ అజహార్ అలీ డబుల్ సెంచరీకి ధీటుగా వార్నర్ బదులిచ్చాడు. మెరుపు వేగంతో శతకాన్ని (144పరుగులు: 143బంతుల్లో 17ఫోర్లు, ఒక సిక్సర్) నమోదు చేశాడు. అంతేకాదు అసీస్ స్కోరుబోర్డును కూడా పరుగులు పెట్టించాడు. వార్నర్ టెస్ట్ కెరీర్లో ఇది 17వ సెంచరీ. ఈ క్రమంలో టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తిచేసుకున్న 19వ ఆసీస్ ప్లేయర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ రెన్షా(10) క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బందులు పడి చివరికి తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ(73నాటౌట్: 122 బంతుల్లో 10 ఫోర్లు)తో కలిసి వార్నర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు స్కోరును మరింత పెంచే క్రమంలో ఇన్నింగ్స్ స్కోరు 244  వద్ద వహాబ్ రియాజ్ బౌలింగ్ లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. 50 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కాగా, పాక్ తమ తొలి ఇన్నింగ్స్ ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia vs Pakistan  David Warner  Azhar Ali  Melbourne  cricket  

Other Articles