Gavaskar laxman takes a dig at wc 2015 format

Gavaskar takes a dig at World Cup 2015 format, Gavaskar lambast World Cup 2015 format, Laxman takes a dig at World Cup 2015 format, Laxman lambast World Cup 2015 format, ICC Associate members, reduce the intensity of competition., world cup india score, world cup india runs, world cup india phots, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores,

Legendary players Sunil Gavaskar and VVS Laxman lambasted the format of the Cricket World Cup 2015, saying that the inclusion of the ICC Associate members could reduce the intensity of competition.

వరల్డ్ కప్ ఫార్మట్ పై గవాస్కర్, లక్ష్మణ్ గుస్సా..!

Posted: 02/13/2015 05:18 PM IST
Gavaskar laxman takes a dig at wc 2015 format

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచ కప్ 2015 సెషన్ లో అనుసరిస్తున్న ఫార్మాట్ పై భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ను మండిపడ్డారు. ఫార్మట్ చప్పగా వుందంటూ ఇద్దరూ వ్యాఖ్యానించారు. మొత్తం 14 జట్టు పోటీపడే ఈ టోర్నీలో గ్రూప్ దశలో అమీతూమీకి పెద్దగా అవకాశాలు లేవంటున్నారు. 14 జట్లలో అగ్రశ్రేణి జట్లు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ దశకు చేరుకుంటాయని, మిగిలిన జట్లు లీగ్ దశలోనే వెనుదిరిగి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అయా గ్రూపులలోని జట్టు ఏవేవి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంటాయో ముందుగానే క్రికెట్ అభిమానులు ఊహించుకోగలుగుతున్నారని అన్నారు.

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో అనుబంధ జట్లను కూడా పాల్గొనేలా చేయడం వల్ల ప్రపంచకప్ పై అసక్తి తగ్గేలా చేస్తోందన్నారు. లీగ్ దశలో పోటీ తీవ్రత తగ్గడంతో ఆటపై ఆసక్తి తగ్గుతుందని పెదవి విరిచారు. ప్రపంచ కఫ్ ను కేవలం అగ్రశేణి పది జట్ల మద్య నిర్వహించాలని వారు అభిప్రాయపడ్డారు. ఇందుకు ఐసీసీ జారీ చేసే ర్యాకింగ్ ల ఆధారంగా తొలి ఎనమిది జట్లు అటోమెటిక్ గా క్వాలిఫై కావాలని, చివరి రెండు స్థానాల కోసం.. ప్రపంచ క్రికెట్ కప్ కు ఓ ఏడాది ముందు మిగిలిన జట్ల మధ్య పోలీని నిర్వహించాలని వారు సూచించారు.

అయితే లీగ్ దశలో అడటం పసికూనలుగా భావిస్తున్న అఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ వంటి పలు జట్లకు కూడా లాభిస్తుందని చెప్పారు. అగ్రశ్రేణి జట్లను ఓడించ గలిగితే పసికూనలు కూడా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు వుంటాయని గవాస్కర్ విశ్లేషించాడు. ష్పీన్నర్లపై ఆధారపడే టీమిండియా జట్టు వరల్డ్ కప్ ను మరో పర్యాయం నిలబెట్టకోవాలంటే కొంత అధికంగానే చమడోల్చాల్సిన అవసరముందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Gavaskar  VVS Laxman  ICC cricket world cup 2015  format  

Other Articles