Sania mirza speaks about telangana state and cm kcr

sania mirza, sania mirza latest news, sania mirza telangana brand ambassador, telangana brand ambassador, sania mirza photo shoot, sania mirza hot gallery, sania mirza news, telangana state, sania mirza press meet

sania mirza speaks about telangana state and cm kcr

సీఎం కేసీఆర్ మీద సానియా మీర్జా వ్యాఖ్యలు!

Posted: 10/29/2014 03:01 PM IST
Sania mirza speaks about telangana state and cm kcr

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే! ఆ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఎంపికచేయడం జరిగింది. అయితే ఆ విషయమై అప్పట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. స్థానికత గురించి ఎప్పుడూ మాట్లాడే ఆయన... పాకిస్తాన్ కోడలైన సానియాను రాష్ట్ర అంబాసిడర్ గా ఎలా ఎంపిక చేస్తారంటూ తెగ విమర్శలు వచ్చేశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు రావడంకోసమే సానియాను అలా ఎంపిక చేయడం జరిగిందని తెలిసి.. అందరు ఆయన తెలివిని మెచ్చుకున్నారు. పైగా కేసీఆర్ భావించినట్లే ప్రస్తుతం సానియా వరుస విజయాలతో దూసుకుపోతూ... పోయిన ప్రతిచోటా తెలంగాణ రాష్ట్రం గురించి, ఆయన గురించి ప్రస్తావింటుందని స్వయంగా సానియానే పేర్కొంది.

సానియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన తర్వాత యూఎస్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇక అప్పటినుంచి తాను ఆడిన ఆటలన్నీ దాదాపుగా గెలుచుకుంటూ వరుసగా టైటిల్స్, పతకాలను తన ఖాతాలో జమచేసుకుంటూ వస్తోంది. అలాగే మొన్న జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా తన విజయాల గురించి కొన్ని విషయాలను తెలిపింది. 2010లోనే సానియా రిటైర్ అవుతానని భావించిందని.. కానీ 2014 తాను ఇంత అద్భుతమైన ఫామ్ లోకి తిరిగొస్తానని ఊహించలేకపోయానంటోంది! ఫామ్ లోకి తిరిగిరావడం చాలా సంతోషంగా వుందని తెలిపిన సానియా.. ప్రపంచ టెన్నిస్ లో నెంబర్ వన్ ర్యాంకు సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. ఈ ఏడాది గ్రాండ్ స్లామ్ తోపాటు ఛాంపియన్ షిప్ టైటిళ్లు గెలుచుకున్న ఈ అమ్మడు.. నెంబర్ వన్ గా నిలవడం కోసం ప్రయత్నిస్తానంటోంది.

ఈ నేపథ్యంలోనే అమ్మడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. కేసీఆర్ ఒక ధృఢమైన నాయకుడని పేర్కొన్న ఆమె... ఆయన నిర్ణయాలేవైనా చాలా వేగంగా తీసుకుంటారని చెప్పింది. అలాగే.. ‘‘నేను ఏ టోర్నీలకు వెళ్లొచ్చినా సీఎం నన్ను అభినందిస్తారు. సీఎం స్థానంలో వుండికూడా ఎంతో ఆప్యాయతగా వుంటారు. అలాగే ప్రతిఒక్కరూ మద్దతిస్తే చాలా ప్రోత్సాహకంగా వుంటుంది’’ అని పేర్కొంది. తన అంబాసిడర్ స్థానం గురించి వివరిస్తూ.. ‘‘తెలంగాన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించగానే ప్రపంచపటంలో ఆ రాష్ట్రానికి గుర్తింపు తేవాలని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లినా తెలంగాణ, బ్రాండ్ అంబాసిడర్ గురించి అడుగుతూనే వుంటారు’’ అని స్పష్టం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  kcr  telangana brand ambassador  celebrities press meet  

Other Articles