Sania mirza shares her personal feelings on marriage life and tennis sports life

sania mirza, sania mirza latest news, sania mirza hot photos, sania mirza interview, sania mirza gossips, sania mirza tennis games, indian tennis sports persons, sania mirza sports news, indian sports news, indian sports persons, wta doubles title, us open tennis games, telugu news, telugu sports news, telugu movie news, telugu movie news websites

sania mirza shares her personal feelings on marriage life and tennis sports life

పెళ్లికాకముందే సానియా మూడుసార్లు...!

Posted: 10/31/2014 12:41 PM IST
Sania mirza shares her personal feelings on marriage life and tennis sports life

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గతంలో పేలవ పెర్ ఫార్మెన్స్ లతో తీవ్ర విమర్శలను ఎదుర్కొందికానీ.. ఈ ఏడాదిలో విశ్వవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటోంది. యూఎస్ ఓపెన్ నుంచి నిన్న జరిగిన డబ్ల్యూటీఏ డబుల్స్ మహిళల ఆటలవరకు ఈ అమ్మడు వరుసగా విజయాలు సాధించుకుంటూ వచ్చింది. ఎన్నడులేని విధంగా తనలో దాగివున్న ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచింది. ఈ అమ్మడు ప్రదర్శించిన ఆటతీరును ప్రపంచదిగ్గజాలు సైతం మెచ్చుకున్నారు. టెన్నిస్ క్రీడలో భారత్ ను ఉన్నతస్థానానికి తీసుకెళ్లింది. దాంతో ఫుల్ ఖుషీగా వున్న ఈ అమ్మడు.. తన ఆనందాన్ని అందిరతో పంచుకుంటోంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించింది.

సానియా టెన్నిస్ క్రీడలో ఎఫ్పటినుంచో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే! ఆమె టెన్నిస్ రంగంలో అరంగేట్రం చేసిన మొదట్లో అద్భుతంగా తన ప్రతిభను ప్రదర్శించింది. కానీ తర్వాత ఏమైందో ఏమోగానీ వరుసగా ఓటమిపాలవుతూ వచ్చింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ నాలుగేళ్ల క్రితమే ముగిసిపోవాల్సింది. అయితే సానియా ఇలా ఒక్కసారిగా డీలా పడిపోవడానికి ఒక బలమైన కారణం వుంది. ఆనాడు ఆమె ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల పదేళ్లలో మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విషయం అంతగా ప్రచారంలోకి రాలేదు కానీ.. తాజాగా సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. పెళ్లికిముందే తనకు పదేళ్లలో మూడు శస్త్రచికిత్సల జరిగినా.. నేడు ఆమె కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది. దీనికంతటికి తన పట్టుదల, కఠోర పరిశ్రమే కారణమంటోంది అమ్మడు! ఇది సానియా గతజీవితంలో ఎదురైన అనుభవం!

అలాగే పెళ్లి తర్వాత తాను అనుభవిస్తున్న కొన్ని ఇబ్బందుల గురించి ఆమె వివరించింది. ఒకదాని తర్వాత ఒకటి టోర్నమెంట్లు వరుసగా ఆడుతున్న తరుణంలో తాను వైవాహిక జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నానని.. కనీసం తన భర్త షోయబ్ తో రెండుమూడురోజులు ప్రశాంతంగా గడిపే సమయం కూడా లభించడం లేదని తెలిపింది. టోర్నమెంట్లకు ముందు రాత్రింబవళ్లు చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది... అలాగే టూర్లకు వెళ్లినప్పుడు చాలారోజులు బయటే గడపాల్సి వస్తుంది... ఇటువంటి పరిణామాల వల్ల తన భర్తతో దూరంగా వుండాల్సి వస్తోందంటూ ఆమె పేర్కొంది. అయితే అందరిలాగే సాధారణ జీవితం వుంటే బాగుండని ఆమెకు అప్పుడప్పుడు భావిస్తుందని.. తాను జీవిస్తున్న బిజీ జీవితమే బాగుందని తెలుపుతోంది. ఐతే.. జీవితాన్ని ఉన్నతంగా చూసినప్పుడు ఇవన్నీ చిన్నవిషయాలే అంటోంది అమ్మడు.

ఆటమీద తనకున్న ప్రాధాన్యత గురించి వివరిస్తూ.. ‘‘కెరీర్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆరోగ్యంగా వున్నంతకాలం ఆటను ఆస్వాదిస్తున్నవరకు టెన్నిస్ ఆడుతాను. ఎప్పటివరకు ఆడాలి అనే సమయాన్ని కేటాయించలేను’’ అంటోంది అమ్మడు. 2016లో జరగబోయే రియో ఒలంపిక్స్ ఈ అమ్మడు పాల్గొంటానని పేర్కొంటోంది. అలాగే ఆ తర్వాతి కాలంలో కూడా తనకు అవకాశమొస్తే తన క్రీడాజీవితాన్ని కంటిన్యూ చేస్తానంటోంది ఈ టెన్నిస్ స్టార్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  indian sports persons  tennis game  telugu news  

Other Articles