Teluguwishesh 29.gif 29.gif krishnam-vande-jagadgurum-movie-review Product #: 40039 stars, based on 1 reviews
  • Movie Reviews

    సినిమా పేరు : ‘కృష్ణం వందే జగద్గురుం’
    విడుదల తేదీ: 30 నవంబర్ 2012

    దర్శకుడు : క్రిష్
    నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి
    సంగీతం : మణిశర్మ
    నటీనటులు : రానా, నయనతార, బ్రహ్మానందం, కోట, పోసాని, మిలింద్ గునాజి, ఎల్బీ శ్రీరామ్, మురళి శర్మ,  రఘుబాబు,  సత్యం రాజేష్, వెంకటేష్ గెస్ట్ అప్పీరియెన్స్
    తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.5

    Krishnam_Vande_Jagadgurum_innee

    పరిచయం :       

       హీరో దర్శకుడు ఇద్దరికీ కమర్షియల్ హిట్ అవసరమైన టైంలో రూపుదిద్దుకున్న రానా, క్రిష్ భారీ మూవీ ‘కృష్ణం వందే జగద్గురుం’. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ వెండితెరలను తాకింది. ఎప్పుడూ క్రియేటివ్ గా తన సినిమాలను తెరకెక్కించే క్రిష్ ఈసారి తన తాజా మూవీకి చాలా వరకూ కమర్షియల్ హంగులు అద్దాడు. తెలుగు భాష, సంస్కృతి పరిఢవిల్లే సినిమా ఇదంటూ ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో మహామహులు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకూ అలరించిందో. హీరో రానాకు, క్రిష్ కు ఈ సినిమా ఎంతవరకూ పేరు తెచ్చిపెడుతుందో ఇప్పుడు చూద్దాం.
    కథాంశం :
            వంశపారంపర్యంగా వచ్చే ఉపాదికి స్వస్తి చెప్పి విదేశాలకు వెళ్లి జీవితం గడపాలనుకున్న ఓ యువకుడు జీవితం ఎలా మలుపు తీసుకుంది అనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో తెలుగు జాతి, భాష, సంస్కృతి , కళా సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ  సమాజంలో అక్రమార్కుల ఆటకట్టించటమే ఈ చిత్రంలో ప్రధానం. ఇక కథలోకి వెళితే, బి.టెక్ బాబు (రానా) వీసా వస్తే అమెరికా వెళ్లిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. అతనికి వారసత్వంగా వస్తున్న నాటకాలు వేసే వ్రుత్తి మీద ఆసక్తి ఉండదు. అయితే సుబ్రహ్మణ్యం (కోట శ్రీనివాస రావు) కి మనవడు అమెరికా వెళ్ళడం ఇష్టం ఉండదు. ఈ పరిస్థితుల్లో అందాకా, బాబు తన తాత బలవంతం మీద నాటకాల్లో నటిస్తుంటాడు. తన సొంత ఊరు బళ్ళారిలో ఒకసారి నాటకం వేయాలని సుబ్రహ్మణ్యం కోరిక. ఆ కోరిక తీరకుండానే సుబ్రహ్మణ్యం చనిపోతాడు.
          ఇక్కడ కథ అనుకోని టర్న్ తీసుకుంటుంది.  బళ్ళారిలో నాటకం వేసి తాత చివరి కోరిక తీర్చి అక్కడే ఆయన అస్థికలు కలపడానికి బాబు భళ్లారి వెళతాడు. అక్కడే జర్నలిస్ట్ దేవిక (నయనతార) పరిచయమవుతుంది. తన ఊరిలో జరుగుతున్న మైనింగ్ మాఫియా గురించి దేవిక చెప్పిన మాటలు బాబుని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రెడ్డప్ప (మిలింద్ గునాజి) చేస్తున్న అక్రమాలు, అరచాకాల మీద కత్తి దూసిన బాబు వీరి పద్మవ్యూహం నుంచి తప్పించుకుని ఎలా అక్రమార్కుల ఆట కట్టించాడనేది తెరమీదే చూడాలి.

    krishnam_vande_jagadgurum2eనటీనటుల పనితీరు  :
          ప్రస్తుతం నడుస్తోన్న సినిమాల్లో సురభి నాటకాలు వేసే పాత్ర దొరకటం బహు అరుదు. ఈ అవకాశాన్ని రానా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. బీటెక్ బాబుగా రానా నటన, అతని డైలాగ్ డెలివరి, టైమింగ్ ఆకట్టుకోవటమే కాదు నటనలో పరిణితి కనిపించింది. నాటకాలు కట్టే సమయంలో అయితే అమోఘం. భారీ స్లోకాన్ని రానా చెప్పిన తీరు ఔరా అనిపించక మానదు.
            ఇక హీరోయిన్ నయన్ కు దేవికగా కీలక పాత్ర దొరికింది. రెండో దఫా తెరంగేట్రం చేసిన నయన తారకు కలిసొచ్చే సినిమా ఇది అనటం అతిశయోక్తి కాదు. అరెరే పసి మనసా పాటలో ఆమె అభినయానికి నూటికి నూరు మార్కులు పడతాయి. ఇక ఏ పాత్రలో అయినా ఇమిడిపోగల కోట శ్రీనివాస రావు గూర్చి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది..
            తన తొలి తెలుగు చిత్రం లోనే విలన్ పాత్రలో మిలింద్ గునాజి ప్రతిభ కనబరిచాడు. టిప్పు సుల్తాన్ పాత్రలో పోసాని కృష్ణ మురళి, రంపం పాత్రలో బ్రహ్మానందం నవ్వించారు. మట్టిరాజు పాత్రలో ఎల్బీ శ్రీరామ్, ఇంకా మురళి శర్మ, రఘుబాబు, సత్యం రాజేష్ పాత్ర పరిధి మేరకు నటించారు. సై ఆంధ్రి నాను పాటలో వెంకటేష్ గెస్ట్ అప్పీరియెన్స్ అదుర్స్ అనిపించింది.
    అనుకూల ప్రతికూలాంశాలు :
           మొత్తం సినిమాలోని కళాకారులందరి నుంచీ, ప్రతిభను పూర్తి స్థాయిలో, వారి వారి పరిధి మేరకు ఔట్ తీసుకోవటంలో దర్శకుడు సఫలమయ్యాడు.  ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. అయితే విభిన్న కథాంశం కారణంగా  ప్రారంభంలో వచ్చే సురభి నాటకాల ఎపిసోడ్స్ యువ ఆడియన్స్ అర్ధం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. మొదట స్లోగా అనిపించి అనంతరం కథ స్పీడ్ అందుకుంటుంది. 
             ఫస్టాఫ్ లో వచ్చిన స్పైసి స్పైసి గర్ల్, రెండవ భాగంలో వచ్చే చల్ చల్ పాటలు సందర్భాను సారంగా అనిపించవు. విలనిజం మీద బాగా హైప్ క్రియేట్ చేసి ఆతర్వాత తేల్చేయటం చిత్ర విజయానికి ఆటంకం కలిగించే అంశం. ఫైట్స్, యాక్షన్స్ సీక్వెన్స్ కూడా బావున్నాయి. మరింత గ్రాఫిక్స్ అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.  మణిశర్మ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. జగన్నాటకం పాటని సినిమా మొత్తం వాడుకోవటం వల్లే ప్రయోజనం చేకూరింది. అరెరే పసి మనసా, సై ఆంధ్రి నాను పాటల చిత్రీకరణ కూడా బావుంది.  జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చూడచక్కగా ఉంది. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ అందరినీ ఆలోచింప చేస్తాయి.
    ఉపసంహారం :
            సినిమాటిక్ గా కొన్ని లోపాలున్నా కృష్ణం వందే జగద్గురుం చూడాల్సిన సినిమానే. ఇక బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయనే దానికోసం కొంతకాలం వేచి చూడాల్సిందే.

    ...avnk

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com