కబాలి రివ్యూ | kabali telugu movie review

Teluguwishesh కబాలి కబాలి Rajinikanth kabali telugu movie review Product #: 76550 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కబాలి

  • బ్యానర్  :

    కలైపులి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, వీ క్రియేషన్స్ (తెలుగులో షణ్ముక ఫిల్మ్స్... )

  • దర్శకుడు  :

    పా రంజిత్

  • నిర్మాత  :

    ఎస్.థాను

  • సంగీతం  :

    సంతోష్ నారాయణన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    జి.మురళి

  • ఎడిటర్  :

    ప్రవీణ్ కేఎల్

  • నటినటులు  :

    రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక,నాజర్, కిషోర్, విన్ స్టన్ చావో, జానీ విజయ్, కలయరసన్, దినేష్ రవి తదితరులు

Kabali Telugu Movie Review

విడుదల తేది :

2016-07-22

Cinema Story

కబాలి కథ విషయానికొస్తే... 30 ఏళ్ల కిందట మలేషియాకు బతుకు తెరువు కోసం మలేషియా వెళ్లిన భారతీయు వలస కూలీలకు సంబంధించింది. అక్కడి వ్యాపారవేత్తలు వారిని బానిసలుగా భావించి తెగ హింసించే వారు. ముఖ్యంగా చైనాకు కొన్ని మాఫియా గ్యాంగ్ లు వారిని  డ్రగ్స్ సరఫరా కోసం వాడుకునేవారు. దీంతో వారంతా తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉండేవారు. వారిలో కబాలేశ్వరన్ అలియాస్ కబాలి(రజనీకాంత్) కూడా ఒకడు. అందుకోసం సీతారామరాజు(నాజర్) అనే గ్యాంగ్ స్టర్ కింద చేరి పని చేస్తుంటాడు. అంతలో సీతారామరాజు హత్యకు గురవుతాడు. దీంతో ఆ బాధ్యతలను స్వీకరిస్తాడు కబాలి. భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న కబాలి కొన్ని కారణాల వల్ల వారికి దూరం అయి జైలు పాలు కావాల్సి వస్తుంది. ఆ కారణాలేంటి? తిరిగొచ్చాక మళ్లీ డాన్ అవతారం ఎందుకు ఎత్తుతాడు? కరడుగట్టిన గ్యాంగ్ 43 నుంచి, దాని లీడర్ టోనీ వూ(విస్టన్ చావో) నుంచి ప్రజల్ని ఎలా కాపాడాడు... చివరికి కుటుంబంతో సంతోషంగా ఉంటాడా? లేదా? అన్నదే కథ...

cinima-reviews
కబాలి

ఒక సినిమా కోసం అనటం కంటే హీరో కోసం పడిగాపులు పడటం రజనీకాంత్ విషయంలోనే తప్పా ఎవరికీ సాధ్యం కాదు. ఫలితంతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు పెరిగిపోయే అశేష అభిమానులను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇక ఆయా సినిమాలను కూడా అంతకు మించి అంచనాలతోనే రిలీజ్ చేస్తారు. కోలీవుడ్ లో ఆరాధ్య దైవంగానే కాదు సౌత్ లో సూపర్ స్టార్ గా ముద్ర పడిపోయిన ఆయన చాలా కాలం తర్వాత డాన్ గా కబాలి అవతారంలో రాబోతున్నాడు. యంగ్ డైరక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాలో ఏ సినిమా ఇంతవరకు రిలీజ్ కానంత పెద్ద ఎత్తులో ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్లలో ఈరోజు మన ముందుకు వచ్చింది. మరి ఫలితం ఏంటి... కబాలి ఏమేర అలరించాడు. రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

విశ్లేషణ:
తలైవా ఫ్యాన్సే కాదు మాములు జనాలు కూడా చిత్రం తొలి భాగం పూనకంతో ఊగిపోతారు. జైలు నుంచి విడుదలయ్యే రజనీ ఇంట్రడక్షన్ సీన్, కబలి రా... అంటూ వచ్చే పాట... రజనీ ఫైట్ సీన్ యూత్ హీరోలకు ధీటుగా అనిపించకమానదు. అయితే కొన్నిచొట్లో కబాలి టైటిల్ సాంగ్ ను చివర్లోకి మార్చినట్లు సమాచారం. ఓ అరగంట అయ్యాక అసలు కథలోకి ఎంటర్ అయ్యాక కాస్త బోర్ కొట్టక మానదు. తిరిగి ఇంర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను ఎంగేజ్ అయ్యేలా చేస్తోంది. ఇక మలేషియా బ్యాగ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ దాని కోసం దర్శకుడు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అనిపిస్తుంది. మాఫియా గ్యాంగ్ లు, అప్పటి వాస్తవ పరిస్థితులనే దర్శకుడు రంజిత్ తెరపై ఆవిష్కరించాడు. అయితే అతని గత చిత్రాల్లాగే సినిమాల్లో సాగతీత ఇందులోనూ ఉంది. ఫస్ట్ హాప్ తో రజనీ మ్యాజిక్ తో ప్రేక్షకుడు హ్యాపీగా ఫీలయితే, రెండో భాగంలో మాత్రం సెంటిమెంట్ కాస్త ఎక్కువటంతో కాస్త అసహనానికి గురవుతాడు. ఈ విషయంలో ఎడిటర్ ప్రవీణ్ కత్తెరకు చాలా పని చెప్పాల్సి ఉంది.

భార్య కోసం కబాలికి ఇండియాకు రావటం దగ్గరి నుంచి మొదలైన ఈ టార్చర్ సెకండాఫ్ లో సాగదీతగా ఉంటే... ప్రీ క్లైమాక్స్, ముగింపు పీక్స్ లోకి వెళ్లి మళ్లీ అభిమానుల్లో హుషారు పెంచుతుంది. భార్యగా రాధికా ఆప్టే అంతగా సూట్ కాలేదేమో అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి. కూతురిగా మాత్రం ధన్సిక మంచి మార్కులే కొట్టేసింది. రజనీ చుట్టూ ఉండే అనుచరులు, విలన్ మూక ఫర్ ఫెక్ట్ గా సూటయ్యారు. డాన్స్, ఫైట్లలో రజనీని చూసి మురిసిపోవాల్సిందే. టైటిల్ సాంగ్ తో పాటు, ఒక్కడే ఒక్కడొక్కడే పాట విజువల్ గా బాగుంది. నేపథ్య సంగీతం కూడా సూపర్ స్టార్ కు తగ్గట్లుగానే ఇచ్చాడు సంతోష్. అయితే టీజర్, ట్రైలర్ లో చూపిన పవర్ ఫుల్ డైలాగులకు అదనంగా ఓ నాలుగైదు ఉన్నాయే తప్ప మిగతాదంతా మాములు సంభాషణ. గత చిత్రాల మాదిరిగా స్టైల్ ను కొనసాగించినప్పటికీ రజనీ నుంచి ఆశించిన హీరోయిజం అయితే ఇందులో లేదు. అభిమానులకు ఈ విషయంలో నిరాశే ఎదురుకాక మానదు.


ఫ్లస్ పాయింట్లు

రజనీకాంత్

సంతోష్ నారాయణ సంగీతం

మురళి సినిమాటోగ్రఫీ

ఎమోషన్స్

ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు

 

 

మైనస్ పాయింట్లు

నిదానంగా సాగిపోయే కథనం... ముఖ్యంగా సెకండాఫ్

కామెడీ పంచ్ డైలాగులు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం

రజనీ హీరోయిజాన్ని ఎక్కువ ఎలివేట్ చేయకపోవటం


తీర్పు

తన గత చిత్రాల్లోలాగానే దర్శకుడు పా.రంజిత్ తన దర్శకత్వ స్వేచ్ఛను వాడుకున్నాడు. సినిమాకు రజనీకాంత్ హీరో అని కాకుండా కేవలం కథ, కబాలి అనే క్యారెక్టర్లే మెయిన్ పిల్లర్ గా నడిపించాడు. ఆ విషయంలో నిర్ణయానికి, స్టోరీని హ్యాండిల్ చేసిన విధానానికి రంజిత్ ను అభినందించాల్సిందే. అయితే సూపర్ స్టార్ మూలానేమో అది ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. కానీ, పతాక సన్నివేశాల దగ్గరికొచ్చే సరికి దీనికి రజనీ తప్ప వేరేవరూ సరిపోరని అనిపించకమానదు. స్లో నేరేషన్, సగటు ప్రేక్షకుడికి కావాల్సిన కొన్ని దినుసులు మిస్ కావటంతో ఈ కబాలి అంతంగా రుచించదు. థియేటర్ల నుంచి బయటికి వచ్చేప్పుడు తలైవా అభిమానులు మాత్రం ఫుల్ మీల్స్ చేసినంత హ్యాపీగా బయటికి వస్తే... సగటు ప్రేక్షకుడు ఈ మాత్రానికేనా అనుకుంటాడు.

చివరగా... మెరుపులు లేని రజనీ, భారీ అంచనాలు, తమిళ వాసన పక్కన పెడితే ఎంజాయ్ చేయొచ్చు... 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.