Teluguwishesh Pawan Gabbar Singh movie review.GIF Pawan Gabbar Singh movie review.GIF Pawan Kalyan in and as Gabbar Singh in the Telugu adaptation sees him recapping the bald-faced one liners without impunity. Product #: 34288 stars, based on 1 reviews
  • Movie Reviews

    ‘గబ్బర్ సింగ్’ సినిమా రివ్వూ...

    Gabbar-Singh-Wallpaper

    సంస్థ                : పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌
    నటీనటులు        : పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు
    ఫొటోగ్రఫీ           : జైనన్ విన్సెంట్
    సంగీతం            : దేవిశ్రీప్రసాద్
    ఫైట్స్               : రామ్-లక్ష్మణ్
    ఎడిటింగ్           : గౌతంరాజు
    సమర్పణ          : శివబాబు.
    నిర్మాత            : బండ్ల గణేశ్
    మాటలు-దర్శకత్వం: హరీష్‌శంకర్‌

    పవన్ కళ్యాణ్ కి గత 10 సంవత్సరాల నుండి సరైన హిట్స్ లేవు. పసలేని కథలను ఎన్నుకుంటూ ఇన్నాళ్ళు తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద  అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. తాజాగా ‘మిరపకాయ్’ సినిమాతో తన ఘాటు ఏంటో ప్రేక్షకులకు చూపించిన హరీశ్ శంకర్ పవన్ కి వీరాభిమాని. మరి డైరెక్షన్ ట్యాలెంట్ ని, వీరాభిమాన్ని ఈ సినిమాలో ఎలా చూపించాడో ఓ సారి రివ్వూ చూద్దాం.

    కథాంశం :   చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో మారు తండ్రిగా వచ్చిన నాయుడు (నాగినీడు) పై ద్వేషం పెంచుకున్న వెంకట రత్నం నాయుడు (పవన్ కళ్యాణ్) తన తల్లి (సుహాసిని) మరియు కుటుంబాన్ని వదిలేసి చిన్నప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోయి హాస్టల్లో చదువుకుంటూ పోలీసుగా ఎదుగుతాడు. వెంకటరత్నం పేరు ఇష్టం లేకపోవడం మరియు తన చిన్నతనంలో బాగా చూసిన ‘షోలే’ సినిమాలోని ‘గబ్బర్ సింగ్’ పాత్రకి ఆకర్షితుడు కావడం వల్ల తన పేరును కాస్తా గబ్బర్ సింగ్ అని మార్చుకుంటాడు. కొండవీడు పోలిస్ స్టేషన్ ని కాస్తా గబ్బర్ సింగ్ పోలిస్ స్టేషన్ గా మార్చుకుంటాడు. తన పోలిస్ స్టేషన్లో తను పెట్టిందే రూల్స్. భాగ్యలక్ష్మి (శృతి హాసన్) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్ని సంఘ వ్యతిరేక పనులు చేస్తున్న సిద్ధప్ప నాయుడుని (అభిమన్యు సింగ్) గబ్బర్ సింగ్ అడ్డుకోవటంతో అతను గబ్బర్ సింగ్ మీద వైరం పెంచుకుంటాడు. కొన్ని సంఘటనల తరువాత వారి వైరం కాస్తా కుటుంబాల మధ్య తగాదాలకు దారి తీస్తుంది. చివరకు గబ్బర్ సింగ్ కుటుంబానికి ధగ్గరయ్యాడా? ప్రేమించిన భాగ్య లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? సిద్ధప్ప నాయుడుతో వైరం ఏమైంది వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే గబ్బర్ సింగ్ సినిమా చూడాల్సిందే.

    కళాకారుల పనితీరు :

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీసు పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ప్రతి సన్నివేశాని తనదైన శైలిలో చేసి ఆకట్టుకున్నాడు. దానికి తోడు పవన్ చేసిన డాన్సులు ఈ సినిమాకే హైలెట్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే భాగ్యలక్ష్మి పాత్రలో శృతి హాసన్ పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో తనకు పెద్దగా రోల్ లేకపోయినప్పటికీ తనకు ఇచ్చిన పాత్రలో బాగానే చేసింది. అయితే ఈ సినిమాలో ఆమెకు డబ్బింగ్ కొద్దిగా సూట్ అవ్వలేదు. నాగినీడు బాగానే చేశాడు. సుహాసిని గూర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విలన్ గా అభిమన్యుసింగ్, అతని ప్రక్కన ఉన్న తనికెళ్ళ భరణి కూడా తన పాత్రలతో అందరిని ఆకట్టుకున్నాడు. రికవరీ రంజిత్ కుమార్ పాత్రలో బ్రహ్మానందం బాగా నవ్వించాడు. ఫాలోయింగ్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు అంటూ అలరించాడు. సాంబ పాత్రలో అలీ కూడా బాగానే నవ్వించాడు. చిత్ర మొదటి భాగంలో ప్రతి సన్నివేశం అలరిస్తూ సాగుతుంది. స్క్రిప్ట్ కూడా చాలా వేగంగా సాగుతూ బోర్ కొట్టకుండా మరీ ముఖ్యంగా అభిమానులను అలరించే డైలాగులు చెబుతూ ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్ చాలా హైలెట్.  ఈ సినిమాలో అజయ్ పాత్ర సెకండాఫ్ లో కొద్దిగా ఇంపార్టెన్స్ తగ్గింది.

    Gabbar-Singh-Wallpaper1

    టెక్నీషియన్స్ పనితీరు : 

    ఈ సినిమాకి డైరెక్టర్ హరీశ్ శంకర్ రాసిన డైలాగ్ లు, పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చూపించడంలో ఆయన కష్టపడ్డ తీరు చూస్తే పవన్ పై హరీశ్ శంకర్ కి ఎంత అభిమానో ఇట్టే తెలుస్తుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసిన జయనన్ హీరోయిజాన్ని, ప్రతీ సీన్ ని హైలెట్ గా చేశాడు. గౌతం రాజు ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా సినిమాకి ఇంత హైప్ తీసుకురాడానికి పాటలు ముఖ్యకారణం. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అద్బుతం.

    గబ్బర్ సింగ్ సినిమాలోని కొన్ని డైలాగ్స్:

    - విలన్ : ఎవడ్రా నువ్వు?
    గబ్బర్ సింగ్ : పేర్లు గోత్రాలు చెప్పడానికి నేను ఏమైనా గుడి కొచ్చాను ఏంట్రా? తెలుసుకోవడాలు ఎముండవు .. తేల్చుకోవడాలే …
    *విలన్ : కుక్కల్ని పెంచుకునేది అవతల వాళ్ళని కరవడానికి.. యజమానుల మీద అరవడానికి కాదు…
    *నాక్కొంచెం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది…
    *గబ్బర్ సింగ్ స్టేషన్ నుంచి తప్పించుకోవటం అంటే పారిపోవటం కాదు పైకి పోవటం …

    మొత్తంగా చెప్పాలంటే... గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దేని కోసం ఎదురు చూస్తున్నారో... అది ‘గబ్బర్ సింగ్’ లో ఉంది. ఇక బాక్సీఫీసుని షేక్ చేయడమే తరువాయి.

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com