Pain killer tablets for back pain

pain killer tablets for back pain,back, face, tongue and joint pain.

pain killer tablets for back pain

pain.gif

Posted: 07/18/2012 01:21 PM IST
Pain killer tablets for back pain

pain killer tablets for back pain

వెన్ను బలంగా, ఆరోగ్యంగా ఉంటే అది ఐఫిల్ టవర్‌లా శరీరాన్ని అంతెత్తున నిలబెడుతుంది. ఆ వెన్నే దెబ్బతినిపోతే శరీరం శవపేటికలా మారిపోతుంది. వెన్ను చుట్టూ కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు కీళ్లు, నరాలు ఇవన్నీ చేదోడు వాదోడుగా ఉంటూ మొత్తం శరీర వ్యవస్థనంతా నిలబెడుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఆ విభాగాలన్నీ, అస్తవ్యస్తమైతే, ఉత్సాహం, ఉత్తేజం అలా ఉంచి అసలు బతికున్న స్పృహే ఉండదు. అందుకే వెన్నును కాపాడుకోవడంలోనే, అవసరమైనప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవడంలోనే అసలైన వివేకం ఉంది.

ఎన్నెన్నో కారణాలు

వె న్ను అనేది అత్యంత విలక్షణమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న దెబ్బ పడినా వెన్నునొప్పి రావచ్చు. కీళ్లల్లో వాపు రావచ్చు. డిస్కులు ఒత్తిడికి గురై అందులోని గుజ్జు బయటికి రావచ్చు. ఆ గుజ్జుతో నరాలు ఒత్తిడికి గురికావచ్చు.అలా వెన్నునొప్పి రావచ్చు. ఇతరమైన మరే కారణాలూ కాకపోయినా, అనివార్యంగా వచ్చిపడే వృద్దాప్యంతో డిస్కులు, పూసలు అరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి శరీరం క్షీణించడం ఏ 50 ఏళ్లకో మొదలైతే, డిస్కులు దెబ్బతినడం అన్నది 20 ఏళ్లనుంచే మొదలవుతుంది.

అంటే డిస్కులోని సహజ ద్రవాలన్నీ ఆవిరికావడం మొదలవుతుంది. డిస్కులు అతి చిన్న ప్రాయం నుంచే క్షీణిస్తూ వెళుతున్న క్రమంలో ఇంక వృద్దాప్యం కూడా వచ్చేస్తే, ఎలా ఉంటుంది? వీటన్నిటినీ మించి జీవన శైలి విషయంలోగానీ, శరీర భంగిమల విషయంలో గానీ, ఆహార వ్యాయామాల విషయంలో గానీ, తప్పులు కూడా చేసుకుంటూ పోతే? ఏ ప్రమాదాలకో గురైతే? కలలు నిజం కావడం మాట అలా ఉంచి, అసలు ఉన్నచోటు నుంచి కాళ్లే కదలవు.

pain killer tablets for back pain

పెయిన్ కిల్లర్స్ ఏంచేస్తాయని?

ఒకదశలో కండరాలు పట్టేయడం, బిగదీసుకోవడంతో మొదలయ్యే సమస్య, క్రమంగా డిస్కులు క్షీణించే దాకా పోయి వెన్నునొప్పి రావచ్చు. ఇవే కాకుండా ఇన్‌ఫెక్షన్ల కారణంగా, కొన్ని కణుతుల కారణంగా కూడా డిస్కులు దెబ్బ తిని వెన్ను నొప్పి రావచ్చు.ఈ సాధారణ కారణాలే కాకుండా క్షయ వ్యాధి, మూత్రసంబంధిత ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, అపెండిసైటిస్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, ఆస్టియోపొరోసిస్, ఒంటి నొప్పులు కలిగించే ఫైబ్రో మయాల్జియా ఇలా పలుకారణాలతోనూ వెన్నునొప్పి రావచ్చు. మొత్తానికి ఇవన్నీ వెన్నునొప్పిని కలిగించే వే. ఇవన్నీ వాత వికృతి వల్ల వచ్చేవే.

వాతాన్ని హరించకుండా కేవలం పెయిన్‌కిల్లర్స్ వేసుకోవడం ద్వారా ఎంత కాలమని నొప్పిని అణచివేస్తారు? నొప్పిని అణచివేయడం కాదు. నొప్పిని మూలాలతో సహా పెరికి వేయడం ఒక్కటే అసలైన వైద్యం. వాస్తవానికి వాతాన్ని హరించి, వెన్నునొప్పిని తొలగించే ఆ శక్తి ఒక్క ఆయుర్వేదానికే ఉంది. అసలు ఏ వ్యాధి కారణంగా వెన్నునొప్పి వచ్చిందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, నొప్పి తగ్గడమే మహాభాగ్యమనుకుంటూ ఉండిపోవడం నిజంగా ఎంత ప్రమాదం? ఉదాహరణకు, క్షయవ్యాధి వల్ల ధాతుక్షయం జరిగి, ఆ క్రమంలో ఎముకలకు సంబంధించిన అస్థిధాతువు క్షీణిస్తుంది. వైద్య చికిత్సలను క్షయవ్యాధికే పరిమితం చేస్తే అస్థిధాతువు మాటేమిటి? దెబ్బ తిన్న వెన్నుపూసలు, డిస్కుల పరిస్థితి ఏమిటి?

ఇతర సమస్యలు కూడా వస్తే....

ఎంత సేపూ నొప్పిని తగ్గించుకునే పనిలోనే ఉండిపోతే, ఆ నొప్పికి కారణమైన అసలు సమస్యలకు ఎవరొచ్చి వైద్యం చేయాలి? మూలాల్లోకి వెళ్లని ఈ ధోరణితో ఎవరైనా ఎన్నాళ్లు బతుకును ఈడుస్తారు? పెయిన్ కిల్లర్ వల్ల ఆ భాగం మొద్దుబారిపోయి నొప్పి తెలియదేమో గానీ, ఉన్న నొప్పి పోయేదేమీ లేదు. అలా నొప్పి పోవాలంటే శరీరంలో పెరిగిపోయిన వాతాన్ని హరించాలి. అల్లోపతి వైద్య విధానంలో అది ఎలాగూ సాధ్యం కాదు. వయసు పైబడటం వల్లో లేదా ఏదైనా ప్రమాదం వల్లో వచ్చే వెన్నునొప్పికే ఎంతో శ్రద్ద వహించాలి.

pain killer tablets for back pain

అలాంటిది అధిక రక్తపోటు, మధుమేహం థైరాయిడ్ సమస్యలు, స్థూలకాయం,, పొగతాగడం వంటివి కూడా ఈ సమస్యకు తోడైతే ఇంక అల్లోపతి వైద్య విధానంలో జరిగేదేమిటి? అప్పటికే మధుమేహం ఉండి, పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటే ఏమవుతుంది? ఉన్నట్లుండి ఒకరోజు కిడ్నీలు ఫెయిల్ అయితే దానికి మధుమేహం కారణమో, పెయిన్‌కిల్లర్స్ కారణమో తేల్చుకోలేని స్థితిలో పడిపోతారు. ఆయుర్వేదంలో,,,, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల వచ్చే తొలి సమస్య మలబద్ధకం. మలబద్ధకం వల్ల వాతం మరింతగా పెరుగుతుంది. వాతాన్ని తగ్గించాల్సింది పోయి ఇక్కడ వాతాన్ని పెంచుతున్నారు.

దీనివల్ల వెన్నునొప్పి సమస్య మరింత జఠిలమవుతుంది.. శరీర వ్యవస్థను మొద్దుబారిపోయేలా చేసే పెయిన్ కిల్లర్స్ వల్ల జీవక్రియలన్నీ కుంటుపడతాయి. ఈ క్రమంలో గుండె వేగం, శ్వాసకోశాల పనివేగం తగ్గిపోతాయి. ఆయుర్వేదం అలా కాదు. వెన్నునొప్పికి అసలు కారణమైన వాతాన్ని తగ్గిస్తుంది. వె న్ను చుట్టూ ఉంటే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు, కీ ళ్లు ఎంతో సవ్యంగా, చైతన్యంగా పనిచేసేలా చేస్తుంది. ఇందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలు, మేరు చికిత్సలు దివ్యంగా పనిచేస్తాయి. రసాయన చికిత్సలు శరీరంలో జీవశక్తిని నింపుతాయి. ఇవన్నీ నొప్పిని తగ్గించడం కాదు. నొప్పి మూలాలను తగ్గిస్తాయి. అప్పటిదాకా మీ వెన్నంటే నడిచిన నొప్పి, మీ కనుచూపు మేరలో లేకుండాపోతుంది.

pain killer tablets for back pain

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma dharna in vijayawada
Facebook turning teens into gambling addicts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more