రాజకీయ స్వార్థం కోసం కుటుంబాలలో జగన్ చిచ్చుపెడుతున్నాడని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పచ్చటి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన ఉసురు తగలకమానదని ఆయన అన్నారు. తన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైఎస్ఆర్ పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో, దేవినేని ఉమా స్పందించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్మోహన్రెడ్డి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలన్న కుట్రతో కుటుంబాలలో చిచ్చు పెట్టటానికి కూడా వెనుకాడటం లేదన్నారు. జగన్ అవినీతి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ తాను పోరాటం చేస్తుండటంతో జగన్ తన కుటుంబంలో కూడా చిచ్చుపెట్టాడని విమర్శించారు. దేవినేని రమణ తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన వ్యక్తిఅని, పార్టీకి సైనికుడిగా పనిచేశాడని అన్నారు. ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మూడు సార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.
చంద్రబాబు నాయకత్వాన పనిచేస్తూ ఆయన జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పట్టుదలతో నిర్వహిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నానని అన్నారు. తనను ఎదుర్కోవటం చేతకాక కుటుంబంలో చిచ్చుపెట్టినంత మాత్రాన చలించేది లేదని అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు తాను తెలుగుదేశం పార్టీకోసం పనిచేస్తానని ఉమా పేర్కొన్నారు. టీడీపీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న తాను రక్త సంబంధాన్ని తెంచుకుంటున్నానని, కన్నతల్లిలాంటి పార్టీ కోసం ప్రాణాలర్పిస్తానని చెప్పారు. జగన్ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. జగన్‌కు బ్రోకర్‌గా వై.వి.సుబ్బారెడ్డి కుటుంబాలలో చిచ్చు పెట్టే సంస్కృతికి తెరలేపుతున్నాడని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more