Nupur mehta reveals dating tillakaratne dilshan

Nupur Mehta reveals dating Tillakaratne Dilshan,Nupur Mehta,Match fixing,Jo Bole So Nihal,India vs Pakistan,Bollywood actress,Shekhar Suman, Mover and Shakers, Nupur Mehta, Jo Bole So Nihaal, match fixing, honey trap, players

Nupur Mehta reveals dating Tillakaratne Dilshan

dating.gif

Posted: 03/27/2012 07:39 PM IST
Nupur mehta reveals dating tillakaratne dilshan

Nupur Mehta reveals dating Tillakaratne Dilshan

ఒక అందమైన అమ్మాయి .. అతనితో నేను డేటింగ్ చేశాను అని బహిరంగంగా చెబుతుంది. అదే విషయాన్ని నేను ఒక అమ్మాయితో డేటింగ్ చేశాను అంటే .. అదీ న్యూస్ కాదు. ఇప్పుడు ఆ అందమైన అమ్మాయి అతనితో నేను డేటింగ్ చేశాను అని స్వయంగా చెప్పాటం పెద్ద టాపిక్ గా మారింది.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లోకి భారత క్రికెటర్లను లాగొద్దని బాలీవుడ్ నటి నుపుర్ మెహతా కోరింది. అసలా విషయంపై తానేమీ మాట్లాడనని స్పష్టం చేసింది. అంతగా గుర్తింపు లేని ఈ నటిని బుక్ మేకర్లు క్రికెటర్లను ఆకర్షించేందుకు ఉపయోగించేవారని ఇంగ్లండ్‌కు చెందిన ‘ది సండే టైమ్స్’ ఇటీవల ఓ కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. అసలు క్రికెట్‌లో ఫిక్సింగ్‌పై తనకెలాంటి అవగాహన లేదని, త్వరలోనే ఆ పత్రికకు లీగల్ నోటీసును పంపించనున్నట్టు తెలిపింది. మరోవైపు భారత క్రికెటర్లతో సంబంధాలపై సమాధానమిచ్చేందుకు నిరాకరించింది.

‘దయచేసి భారత క్రికెటర్లను ఇందులోకి లాగొద్దు. ఈ విషయంలో నేనేమీ మాట్లాడను. శ్రీలంక ఆటగాడు తిలరకత్నే దిల్షాన్‌తో డేటింగ్ మాత్రం నిజమే. ఈ అంశంపై లంక బోర్డు వ్యాఖ్యానాలను నేను తప్పుపడుతున్నాను. ఇంగ్లండ్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ సమయయంలో అతడితో బయటికి వెళ్లాను. సండే టైమ్స్‌లో మాపై కథనం వచ్చింది కాబట్టే దీనిపై వివరణ ఇస్తున్నా. లేకుంటే ఫలానా వారి పేర్లు వెల్లడించాలనే మనస్తత్వం నాది కాదు’ అని ఆమె స్పష్టం చేసింది. అటు దిల్షాన్, నుపుర్‌పై వచ్చిన వార్తలను ఇదివరకే శ్రీలంక క్రికెట్ బోర్డు ఖండించింది. అవన్నీ నిరాధారమైన కథనాలను దిల్షాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది.

ఏదోలా పేరు తెచ్చుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు వస్తున్న విమర్శలను నుపుర్ తిప్పికొట్టింది. అలాంటి అవసరం లేదని, తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నట్టు తెలిపింది. ‘ఇది పేరు కోసం పాకులాడే ప్రయత్నం కాదు. ఇది చాలా సీరియస్ విషయం. మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసముంటే దానర్థం భావోద్వేగాలుండవని కాదు. నేను ప్రస్తుతం అనుభవిస్తున్న ఆందోళన మీకేమైనా అర్థమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇందులో క్రికెట్ ఆడే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా కూడా ఉన్నాయి. చాలామంది నాకు దూరంగా ఉంటున్నారు. అందుకే నేను నిశ్శబ్దంగా ఉండలేను. నా మార్ఫింగ్ ఫొటో వేసినందుకు పరువు నష్టం దావా వేయొచ్చని మా లాయర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు’ అని రెండు హిందీ చిత్రాల్లో నటించిన నుపుర్ చెప్పింది. తనకిప్పటికే బాలీవుడ్, రియాల్టీ షోల నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నాయని, అయితే ఈ కేసు ముగిసిన తర్వాతే వాటి గురించి ఆలోచిస్తానని నుపుర్ స్పష్టం చేసింది.

మ్యాచ్ ఫిక్సింగ్ కథనంలో నుపుర్ ఫొటోను వాడుకుని అప్రతిష్టపాలు చేసినందుకు సండే టైమ్స్ పత్రికకు త్వరలోనే లీగల్ నోటీస్ పంపిస్తామని నుపుర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ‘ఆ పత్రికకు లీగల్ నోటీస్ పంపనున్నాం. ఆ తర్వాత వారినుంచి ఎలాంటి సమాధానమొస్తుందో వేచి చూడాలి. అలాగే పదిహేను రోజుల్లో సివిల్, క్రిమినల్ దావా వేయనున్నాం. ఎందుకంటే వారి కథనాలన్నీ అవాస్తవం’ అని లాయర్ గౌరంగ్ కాంత్ తెలిపారు. ఈ కథనాలతో నుపుర్‌ను తమ కుమార్తెగా ఒప్పుకునేందుకు ఆమె తల్లిదండ్రులు వెనుకాడుతున్నారని ఓ భారతీయ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన స్పందిస్తూ ఆ పత్రికపై కూడా లీగల్ చర్య తీసుకునేందుకు ఆలోచిస్తున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja racha movie dialogues
The plot was offered to me at the rate of rs 5000 per sqyd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more