Rebel Star Krishnam Raju passes away at 83 అధికార లాంఛనాలతో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు

Tollywood rebel star krishnam raju passes away pm modi telugu leaders condole death

krishnam raju, pm modi, krishnam raju death, k chandrasekhar rao, kcr, y s jagan mohan reddy, Chiranjeevi, Mahesh babu, Baahubali Prabhas, Radhe shyam, Venkaiah Naidu, tollywood, telangana, andhra pradesh, india news, entertainment news

Veteran Telugu actor Uppalapati Krishnam Raju has passed away at the age of 83 in the wee hours on Sunday, family sources informed. He is survived by his wife and three daughters. 'Baahubali' star Prabhas is his nephew. Popularly known as 'Rebel Star' of Tollywood, Krishnam Raju has acted in more than 180 movies in a career spanning over five decades. The actor's last on-screen outing was Prabhas starrer 'Radhe Shyam'.

అధికార లాంఛనాలతో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు

Posted: 09/12/2022 11:56 AM IST
Tollywood rebel star krishnam raju passes away pm modi telugu leaders condole death

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన.. తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈవార్తతో కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 27లోని స్వగృహానికి తరలించి సందర్శనార్థం ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌ శివార్లలోని మొయినాబాద్‌ వద్ద కనకమామిడి ఫాంహౌస్‌లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గత కొంతకాలం నుంచి మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతూ.. పెరిఫెరల్‌ వాస్క్యులర్‌ వ్యాధి కారణంగా కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఏడాదిన్నర కింద కోవిడ్‌ సోకిన అనంతరం న్యుమోనియా, ఇన్ఫెక్టివ్‌ బ్రాంకైటిస్, కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ఆరోగ్యం మరింతగా దెబ్బతినడంతో ఈఏడాది ఆగస్టు 5న ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పట్నించి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కృష్ణంరాజు దాదాపు నెల రోజులుగా వెంటిలేటర్‌ సపోర్టుతోనే ఉన్నారని.. ఆరోగ్యం విషమించి కన్నుమూశారని వైద్యులు తెలిపారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే ప్రభాస్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి వద్ద ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు.

హీరో ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్న ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు కడసారి నివాళులర్పిస్తున్నారు. సీనియర్‌ నటులు కోటా శ్రీనివాస రావు, రాజేంద్రప్రసాద్‌, తనికెళ్ల భరణి, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుభందాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా, మరికొద్దిసేపట్లో కృష్ణంరాజు భౌతికకాయాన్ని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంత సమయం ఉంచనున్నారు.

అనంతరం అక్కడి నుంచి రెబల్‌స్టార్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. బీజేపీ సీనియర్‌ నేత, సినీ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాబోయే తరాలు కృష్ణంరాజు నటనా కౌశలాన్ని, సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయని ఆయన పేర్కోన్నారు. సినీమాతో పాటు సమాజ సేవలోనూ ముందున్న ఆయన రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారని ప్రధాని అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని ప్రధాని పేర్కోన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం వెంకయ్యనాయుడు కృష్ణంరాజు నివాసానికి వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్‌ స్టార్‌ కుటుంబ సభ్యులకు వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలనచిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్‌లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్రవేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.

ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణం రాజు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు ఆప్తమిత్రుడని సీఎం కేసీఆర్‌ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఎస్‌ ఏర్పాట్లు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణంరాజు మృతికి సంతాపం వ్యక్తంచేశారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, ఆయన మీడియాతో​ మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్‌ స్టార్‌ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles