Radhe Shyam' to air on OTT from April 1 ఉగాధి కానుకగా అక్కడ రానున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్.!

Prabhas starrer radhe shyam to stream on ott from april 1

Prabhas, Radhe Shyam, Pooja Hegde, Radha Krishna Kumar, UV Creations, OTT Release, Amazon Prime, Radhe Shyam news, Radhe Shyam updates, Radhe Shyam shoot, Radhe Shyam release date, Radhe Shyam release news, Radhe Shyam new poster, Radhe Shyam new update, Radhe Shyam major update, Radhe Shyam breaking news, Radhe Shyam film news, Tollywood, Movies, Entertainment

Prabhas-starrer Radhe Shyam will see its global premiere on Prime Video from April 1. Directed by Radha Krishna Kumar and presented by Gopi Krishna Movies and produced by UV Creations, the romantic drama also stars Pooja Hegde, Sachin Khedekar, Priyadarsi Pulikonda, Bhagyashree, Jagapathi Babu, Murali Sharma, Kunaal Roy Kapoor, Riddhi Kumar, Sasha Chettri, Sathyan and others.

ఉగాధి కానుకగా అక్కడ రానున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్.!

Posted: 03/28/2022 08:15 PM IST
Prabhas starrer radhe shyam to stream on ott from april 1

పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న విడుదలై మిశ్రమ టాక్‌ను తెచ్చుకుంది. ఇటలి నేపథ్యంలో సాగిన ఈ పిరియాడికల్‌ లవ్‌స్టోరీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మాస్‌ ఆడియాన్స్‌ను నిరాశ పరిచింది. దీంతో ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్‌ అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

దీనిపై తాజాగా అమెజాన్‌ ప్రైం తన ట్విటర్‌ ఖాతాలో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఏప్రిల్‌ 1వ తేదీన రాధేశ్యామ్‌ ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే అస్ట్రాలజర్‌గా కనిపించగా.. పూజ డాక్టర్‌ ప్రేరణగా ఆకట్టుకుంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన ఈ మూవీతో బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె ప్రభాస్‌ తల్లిగా మెప్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Radhe Shyam  Pooja Hegde  Radha Krishna Kumar  UV Creations  OTT Release  Amazon Prime  Tollywood  

Other Articles