మహారాష్ట్రలోని మహాఆఘాడీ ప్రభుత్వంపై విమర్శలకు చేస్తూ.. ఏకంగా శివసేన పెద్దలతో ఢీ కొడుతూ చివరాఖరున కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసి.. తనకంటూ వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తన కార్యాలయాన్ని కూడా కూల్చుకునే స్థితి తెచ్చుకున్నారన్న విషయాలు తెలిసినవే. అద్దాల మేడలో వున్నవారు వివాదాలకు తెరలేపితే కూలేది తమ మేడ అన్న నానుడి నిజం తెలియని నటి దూకుడుగా వెళ్లి మరీ తన కార్యాలయం మీదకు తెచ్చుకున్నారన్న వారూ లేకపోలేదు.
అయితే తాజాగా అమెపై తాజాగా సినీనటుడు ప్రకాశ్ రాజ్ చురకలంటిచేలా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది, జస్ట్ ఆక్కింగ్ అన్న పేరుతో అయన రాజకీయ, ప్రజా సమస్యలపై నిత్యం పలు ప్రశ్నలను సంధిస్తుంటారు. కాగా తాజాగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం తన సినీరంగానికి చెందిన కంగనాపై వ్యంగంగా ప్రశ్నించారు. రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను తాను సినిమా ద్వారా చూపించానంటూ, నిజజీవితంలోనూ ఎవరికీ తల వంచనంటూ ఇటీవల కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. అయితే దీనిపై ఆయన అమెను టార్గెట్ చేశారు.
"ఒక్క సినిమాతో కంగనా రనౌత్ తనను తాను రాణి లక్ష్మీబాయితో పోల్చుకుంటే మరి పద్మావతిగా నటించిన దీపికా పదుకుణె, అక్బర్ గా నటించిన హృతిక్ రోషన్, అశోకగా నటించిన షారుక్, భగత్ సింగ్ గా నటించిన అజయ్, మంగళ్ పాండేగా నటించిన ఆమిర్ ఖాన్, మోదీగా నటించిన వివేక్ ను కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు" అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల కంగనా రనౌత్ శివసేన నేతలపై విమర్శలు చేయడం, ముంబైకి వెళ్లడం, డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినపడుతుండడం వంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆమెకు బీజేపీ మద్దతు ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
#justasking pic.twitter.com/LlJynLM1xr
— Prakash Raj (@prakashraaj) September 12, 2020
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more