Megastar Chiranjeevi panic on chittoor accident అభిమానుల మరణం.. గుండెను కలిచివేసింది: చిరంజీవి

Megastar chiranjeevi panic on chittoor accident

Megastar Chiranjeevi, Mega Fans, Kuppam, Chittoor, pawan kalyan birthday, Shantipuram, Eletrocutuon, Flexi, chiranjeevi tweet, chiranjeevi photos, chiranjeevi tweets, chiranjeevi emotional tweeets, Entertainment, telugu movies, movies, tollywood

Megastar Chiranjeevi got paniced over chittoor accident, where three of the power star pawan kalyan's JanaSena fans lost their lives due to electrocution, said that this incident left him with pain in heart.

అభిమానుల మరణం.. గుండెను కలిచివేసింది: చిరంజీవి

Posted: 09/02/2020 06:32 PM IST
Megastar chiranjeevi panic on chittoor accident

జనసేన అధినేత, సినీనటుడు పవన్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలో ఆయన అభిమానులు వేడుక‌ల ఏర్పాట్ల‌ నేపథ్యంలో  ఫ్లెక్సీలు కడుతూ విద్యుద్ఘాతంతో ముగ్గురు మరణించిన ఘటనపై మెగాస్టార్ చిరంజీవి తన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో చోటు చేసుకున్న విషాధఘటనపై ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలచి వేసిందని అవేదన వ్యక్తం చేశారు. తమకు నిత్యం అండగా వుండే అభిమానులు.. అతిపిన్న వయస్సులోనే ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. కలచివేస్తోందని అన్నారు.

బాధిత అభిమానుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి.. ఇక గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్న మరో ముగ్గరు అభిమానుల కుటుంబాలకు కూడా తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్వీట్ చేశారు. 'చిత్తూరులో పవన్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో  ముగ్గురు మరణించటం నా గుండెను కలిచివేసింది. వారి  కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు  ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ, మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles