Allu Arvind to receive “Champion of Change” award అల్లు అరవింద్ కు ప్రతిష్టాత్మక అవార్డు..

Pranab mukherjee confers champions of change 2019 award to allu aravind

Allu Arvind, Telugu movies, Hemant Soren, Politician, Champion of Change, Pranab Mukherjee, Indian cinema, justice K.G Balakrishnan, former Supreme Court judge, Justice Gyan Sudha Misra, Tollywood, movies, Entertainment

Noted film producer, Allu Aravind is one of the most renowned personalities in the Telugu film industry. His impeccable work for the film industry is appreciated by one and all.

ప్రణబ్ చేతుల మీదుగా అల్లు అరవింద్ కు అవార్డు..

Posted: 01/20/2020 07:40 PM IST
Pranab mukherjee confers champions of change 2019 award to allu aravind

టాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు చెందని అగ్రనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ కు అరుదైన గౌరవం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు పలు భారతీయ బాషల్లోనూ నాలుగు దశాబ్దాలుగా చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్ సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’’ అవార్డు ఇచ్చి స్కతరించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్ కు అందించారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ చేతుల మీదుగా అల్లు అరవింద్‌ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో నెటిజన్లు అల్లు అరవింద్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. గీతా ఆర్ట్స్‌ సంస్థ వరుస సినిమాలతో హిట్లు అందుకుంటోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు విజయం సాధించాయి. గత ఏడాది ‘గీత గోవిందం’, ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో..’ సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచింది.

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమీషన్ మాజీ చైర్మెన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జ్ఞాన్ సుధా మిశ్రాలతో పాటు పలువురు ప్రముఖలు ‘‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’’ అవార్డు కమిటీకీ జ్యూరీగా వ్యవహరిస్తున్న ఇంటరాక్టివ్ ఫారమ్ ఇండియన్ ఎకానమీ ఆధ్వర్యంలో ఈ అవార్డుల నిర్వహణ కార్యక్రమం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles