Complete List of Oscars 2018 Winners | అంగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు.. ఈసారి హవా ఏ చిత్రానిదంటే...

90th academy awards complete list

Hollywood, 90th Academy Awards, Oscar Awards, The Shape of Water, Oscars 2018 Full List, No Indian Movies Oscar 2018

Hollywood’s awards season hit its apex Sunday evening with the 90th annual Academy Awards ceremony. From the moment the nominations were announced in January, this year’s awards were poised to be a battle between Guillermo del Toro’s fantasy The Shape of Water, Christopher Nolan’s wartime epic Dunkirk, and Martin McDonagh’s Three Billboards Outside Ebbing, Missouri. In the end, The Shape of Water emerged victorious, winning a total of four Academy Awards, including Best Picture and Best Director for Guillermo del Toro, and awards for both original score and production design.

ఆస్కార్ అవార్డులు 2018.. విజేతలు

Posted: 03/05/2018 11:29 AM IST
90th academy awards complete list

సినిమా రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా పరిగణించే ఆస్కార్ విజేతల జాబితా నేడు విడుదలైంది. ఉత్తమ చిత్రంగా ది షేప్ ఆఫ్ వాటర్ నిలిచింది. అంతేకాదు ఇదే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు అందించిన గులెర్మో డెల్ టోరోను ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసింది. ఈ చిత్రానికి మరో రెండు అడార్డులు కూడా వరించాయి.

ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి...

ఉత్తమ చిత్రం: ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ దర్శకుడు: గులెర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్ దర్శకుడు)
ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ (త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి సినిమాకు గాను)
ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్ మ్యాన్, (డార్కెస్ట్ హవర్ చిత్రానికి)
ఉత్తమ సహాయ నటి: అల్లిసన్ జానే (ఐ, టోన్యా చిత్రానికి)
ఉత్తమ సహాయ నటుడు: శామ్ రాక్ వెల్ (త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి సినిమాకు గాను)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: గెట్ అవుట్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కాల్ మి బై యువర్ నేమ్ చిత్రం
ఉత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్: కోకో
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఏ ఫాంటాస్టిక్ ఉమన్, చిలీ
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ ఒరిజినల్ గీతం: రిమెంబర్ మి, (కోకో సినిమా)
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ఐకారస్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: హెవెన్ ఈజ్ ఏ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: ది సైలెంట్ చైల్డ్
ఉత్తమ యానిమేషన్ షార్ట్: డియర్ బాస్కెట్ బాల్
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: డన్ కిర్క్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: డన్ కిర్క్
ఉత్తమ నిర్మాణ డిజైన్: ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: బ్లేడ్ రన్నర్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్: డార్కెస్ట్ హవర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫాంటమ్ థ్రెడ్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: డన్ కిర్క్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్లేడ్ రన్నర్

 

శ్రీదేవిని తలుచుకున్న ఆస్కార్...

గతవారంలో మరణించిన భారత సినీ నటి శ్రీదేవిని ఆస్కార్ వేదికపై తలచుకున్నారు. మెమోరియన్ విభాగంలో శ్రీదేవితో పాటు ఈ సంవత్సరం మరణించిన బాలీవుడ్ నటుడు శశికపూర్ కు కూడా నివాళులు అర్పించారు. వీరిద్దరి చిత్రాలను బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవలను సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి పేరు వినపడగానే ఆడిటోరియం మొత్తం ఆమెను గుర్తు చేసుకుంటూ చప్పట్లు కొట్టింది. ఈ సంవత్సరం మెమోరియన్ సెగ్మెంట్ లో భారత్ తరఫున వీరిద్దరి పేర్లు మాత్రమే వినిపించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles