Tenants dupe actress Stole Undergarments | హీరోయిన్ ను మోసం చేసి.. లోదుస్తులతోసహా అంతా దోచేశారు

Meghana naidu cheated by couple

Meghna Naidu, Undergarments, Stole, Fake Aadhar Cards

Bollywood actress Meghna Naidu duped in Goa, tenants even stole the item girl's undergarments. Meghna Naidu has claimed that the couple also took money from her caretaker and neighbours. She said the tenants provided fake aadhar cards and driving licenses for verification.

మేఘనా నాయుడికి చేదు అనుభవం

Posted: 02/22/2018 05:03 PM IST
Meghana naidu cheated by couple

బోల్డ్ బ్యూటీ మేఘనా నాయుడికి విచిత్రమైన అనుభవం ఎదురు అయ్యింది. ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్లు ఆమెను మోసం చేసి మొత్తం సామాన్లతో ఉడాయించారు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం విషయాన్ని ఆమె ఫేస్ బుక్ లో నమోదు చేసింది.

గోవాలో ఆమెకు ఓ ఇల్లు ఉంది. అందులో ఓ గదిలో ఆమె సామాన్లు భద్రపరిచింది. దానిని ఓ గార్డియన్ మెయింటెన్ చేస్తోంది. తాజాగా ఆ ఇంటిని ఓ జంటకు అద్దెకిచ్చారు. ముంబైకి చెందిన తాము.. న్యూజిలాండ్ లో ఉంటున్నామని, అవసరం కొద్ది ఇప్పుడు గోవాకు వచ్చామని చెప్పారు.

దాంతో ఆ కపుల్ కి ఇంటిని అద్దెకు ఇచ్చారు. కొన్ని నెలల నుంచి అద్దె డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. తాజాగా వారు గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించినట్లు తెలుస్తోంది. వెళ్తే వెళ్లారు గానీ మేఘనకు చెందిన వస్తువులను కూడా దొంగిలించికెళ్లారంట. అందులో ఆమె ఇన్నర్ వేర్, సాక్స్ లు కూడా ఉన్నాయని ఆమె పేర్కొంది.

దీనికి తోడు గార్డియన్ గా ఉన్న మహిళ దగ్గర లక్షదాకా డబ్బు తీసుకుని.. ఆమె కొడుక్కి న్యూజిలాండ్ లో ఉద్యోగం ఇప్పిస్తామని ఆ జంట మోసం చేసిందంట. ఈ వ్యవహారంపై ఆమె పోలీస్ కేసు నమోదు చేసిందో? లేదో? స్పష్టత కొరవడింది. పృథ్వీ నారాయణ,  విక్రమార్కుడు, 100 % లవ్, పిల్లజమీందార్ చిత్రాలతో ఆమె తెలుగువారికి పరిచయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meghna Naidu  మేఘనా నాయుడు  

Other Articles