Madhavan Web Series Breathe Teaser Out | బ్రీత్ టీజర్.. కిరాతకుడిగా మారిన సీనియర్ హీరో

Madhavan web series teaser out

Madhavan, Breathe Teaser, Web Series, Amazon Prime, Madhavan Web Series

Madhavan Breathe teaser Out. Maddy plays a father who can turn into a monster to save his child. Starring R Madhavan, this series is about a parent who will go to any extent to save his child. Amazon Prime Produced the series starts streaming on January 26.

మాధవన్ వెబ్ సిరీస్ టీజర్ విడుదల

Posted: 01/05/2018 04:20 PM IST
Madhavan web series teaser out

వెబ్ సిరీస్ ల వైపు ఇప్పుడు తారలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట‌ర్నెట్ స్ట్రీమింగ్ వీడియోల‌కు రోజురోజుకీ ఆద‌ర‌ణ పెరుగుతుండటమే అందుకు కారణం. భాషలకతీతంగా తారలు వాటిల్లో సందడి చేస్తున్నారు. ఆదరణ సంగతి పక్కన పెడితే తెలుగులోనూ ఇప్పుడు అవి వచ్చేస్తున్నాయి.

ఆ మధ్య 'సోష‌ల్‌' అనే వెబ్‌సిరీస్‌లో రానా న‌టించారు. అలాగే హిందీలో కూడా వివేక్ ఒబెరాయ్‌, రిచా చ‌ద్దా, రాజ్‌కుమార్ రావ్ వంటి తార‌లంద‌రూ వెబ్ సిరీసుల్లో కనిపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మరో సీనియర్ నటుడు కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. తమిళ్, హిందీ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న మాధ‌వ‌న్ త్వ‌ర‌లో ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బ్రీత్‌' అనే పేరుతో జ‌న‌వ‌రి 26 నుంచి ఈ వెబ్‌సిరీస్ ప్ర‌సారం కానుంది. ఈ సిరీస్ తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో ప్ర‌సారం కానుంది. తాజాగా టీజర్ ను వదలగా.. అందులో కొడుకును కాపాడుకునే తండ్రి పాత్రలో మాధ‌వ‌న్ క‌నిపించ‌నున్నాడు. కొడుకు బ‌త‌కాలంటే తండ్రి చావాలి... తండ్రి బ‌త‌కాలంటే కొడుకు చావాలి.. అనే ప‌రిస్థితుల్లో తండ్రి తీసుకున్న నిర్ణ‌యం ఏంట‌నే ఆసక్తిక‌ర అంశాన్ని టీజ‌ర్‌లో చూపించి ఆస‌క్తి క‌లిగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles