At-last Okka Kshanam Movie Controversy Resolved | నోటీసులు పంపుతాడనుకుంటే అనిల్ ఇలా చేశాడేంటి?

Okka kshanam controversy end

Okka Kshanam, Anil Sunkara, Vi Anand, Parallel Life, 2 Memiddaram, Allu Sirish, Producer Cahkri, Okka Kshanam Release Date, Surabhi, Seerat Kapoor

Okka Kshanam Anil Sunkara Issue.It looks like everything has resolved. Okka Kshanam starring Allu Sirish has landed in a controversy, as soon as the trailer of 2 Memiddaram, which is the official remake of Korean film ‘Parallel Life’ released. It is produced by Anil Sunkara and it is all about the life of a man whose parallel life existed in 1977.

ఒక్క క్షణం వివాదం సమసిపోయింది

Posted: 12/20/2017 12:04 PM IST
Okka kshanam controversy end

ఒక్క క్షణం చిత్రం కాపీ మార్క్ వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. గత కొన్ని రోజులుగా 2 మేమిద్దరం సినిమా కి.. అల్లు శిరీష్ చిత్రానికి మధ్య పోలికలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఎట్టకేలకు ఆ వివాదం సమసిపోయినట్లు తెలుస్తోంది. కొరియన్ చిత్రం పారాలాల్ రీమేక్ హక్కులు అనిల్ సుంకర దక్కించుకుని 2 మేమిద్దరం చిత్రాన్ని తీశాడు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్క క్షణం తో వివాదం మొదలైందని.. లీగల్ గా కూడా నోటీసులు పంపించాడంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఒక్క క్షణం నిర్మాత చక్రి మాత్రం వాటిని ఖండించాడు.

కానీ, ఆ రూమర్లకు చెక్ పెడుతూ అనిల్ సుంకర్ ఓ ట్వీటేశాడు. దర్శకుడు వీఐ ఆనంద్, నిర్మాత చక్రిలతో చర్చలు ముగిశాయని.. అనుమానాలన్నీ తీరిపోయాయని.. సమస్య పరిష్కారం అయ్యాయని.. ఒక్క క్షణం బిగ్ హిట్ అవుతుందని ముందుగానే చిత్ర యూనిట్ కు అనిల్ కంగ్రాట్స్ చెప్పాడు. దీంతో డిసెంబర్ 28న ఈ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles