Kollywood Hero Donates Huge Amount for a Good Cause | యాడ్ డబ్బులను వద్దనుకున్న హీరో వాటిని ఏం చేశాడంటే...

Kollywood hero donates huge amount

Vijay Sethupathi, Anil Group, Vijay Sethupathi Anil Group, Ariyalur Vijay Sethupathi, Vijay Sethupathi NEET Anitha, NEET Anitha Family, Kollywood Hero Donates, Vijay Sethupathi New Ad

Actor Vijay Sethupathi donates huge amount for a good cause. Vijay donates 50 lakhs to students in memoriam of NEET Anitha.Vijay Sethupathi appreciated by the political fame.

యాడ్ డబ్బులను విరాళంగా ఇచ్చిన కోలీవుడ్ హీరో

Posted: 11/11/2017 09:29 AM IST
Kollywood hero donates huge amount

పారితోషకం కోసం మేకర్లను వేధిస్తున్న స్టార్లు ఉన్న ఈరోజుల్లో ఓ యాడ్ ద్వారా వచ్చిన సొమ్ము మొత్తం ఓ మంచి కార్యానికి ఇచ్చేశాడు ఓ కోలీవుడ్ హీరో. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సుమారు 50 లక్షల డబ్బును పేద విద్యార్థులకు పంచాడు.

నీట్ పరీక్ష కోసం ఆత్మహత్య చేసుకున్న అరియాలూర్ విద్యార్థిని అనిత జ్నాపకార్థం ఈ పని చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశాడు. ‘‘డాక్టర్ కావాలన్న అనిత కల నెరవేరదన్న భయంతో ప్రాణాలు తీసుకుంది. అందుకే ఆమె కోసం గుర్తుగా ఈ సాయం చేస్తున్నా’’ అని విజయ్ ప్రకటనలో తెలియజేశారు.

అనిల్ గ్రూప్ కోసం చేసినా ఈ యాడ్ ద్వారా వచ్చిన సొమ్మును అరియాలూర్ జిల్లాలోని విద్యార్థులకు అందజేశాడు. 774 అంగన్ వాడీలకు 5000 రూపాయల చొప్పున 38,70,000.. 21 వికలాంగ పాఠశాలలకు 50,000 రూపాయల చొప్పున 10,50,000 రూపాయాలు ఓవరాల్ గా 49, 70,000 రూపాయలను అందించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles