Baahubali The Conclusion completes 50 days

Baahubali 2 50 days completed

Baahubali 2, Baahubali 2 50 Days, Baahubali The Conclusion, Baahubali 50 Days, Baahubali The Conclusion, 1700 cr Baahubali 2, Baahubali 2 Moscow Film Festival, Baahubali 2 China, Baahubali The Conclusion Collections, Baahubali 2 Closed Collections

Baahubali 2 completes 50 days amassing Rs 1700 cr, Rajamouli;s Magnum Opus Continues its phenomenal run.

ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ @ 50 రోజులు

Posted: 06/15/2017 03:50 PM IST
Baahubali 2 50 days completed

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో చరిత్రను తిరగరాసిన బాహుబలి ది కంక్లూజన్ కు 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తం 1700 కోట్లతో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవటమే కాదు.. ఇండియాలో ఇప్పటిదాకా ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డులు నెలకొల్పింది. (దంగల్ చైనా వసూళ్లతో ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది)

రాజమౌళి చెక్కిన ఈ కళాఖండం వెనుక ఐదేళ్ల కష్టం ఉన్న విషయం తెలిసిందే. ఓ తెలుగు చిత్రం భారతీయ సిల్వర్ స్క్రీన్ పై ఇంతలా మ్యాజిక్ చేస్తుందని బహుశా బాలీవుడ్ కూడా ఊహించి ఉండదేమో. ఫస్ట్ డే వసూళ్లే కాదు.. ఫాస్టెస్ట్ 500, 1000, 1500 కోట్లు, హిందీలో 500 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్నీ రికార్డులు బాహుబలి ఖాతాలో పడ్డాయి.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ దేశంలోని అన్ని లాంగ్వేజ్ ల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. త్వరలో చైనాలో రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ ఇండియన్ గ్రాండియర్ మూవీ అక్కడ తన కలెక్షన్లతో టాప్ ప్లేస్ లో నిలవాలని ఆశిద్దాం.

తెలుగులో బాహుబలి చిత్రం సమీప కాలంలో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుకుంది. బాహుబలి చిత్రం ఏపీ, తెలంగాణాల్లో కలిపి దాదాపు 198 కోట్లను వసూలు చేసింది. ఇంకా పలు చోట్ల సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో 200 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇక ్రపతిష్టాత్మక మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలి ది కంక్లూజన్ ప్రదర్శితం కాబోతుందని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  50 Days  Rajamouli  Prabhas  

Other Articles