Record Price for PK 25th Movie Pre Release Business

Pk 25 telugu states pre release business

Pawan Kalyan, PK 25th Movie, PK 25 Pre Release Business, PK 25th Business, Baahubali 2 PK 25, Pawan kalyan Record price Business, Pawan Trivikram 25th Movie, Pawan New Movie Pre Release Business

Aftre Baahubali 2 Pawan kalyan Trivikram Combo Movie pre release business record price for telugu states. The film has been sold for an approx 94 Cr in Telugu states which is more than Baahubali 1 and only next to Baahubali2.

పీకే 25 .. బాహుబలి-2 కంటే తక్కువే...

Posted: 06/06/2017 12:37 PM IST
Pk 25 telugu states pre release business

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కోంబోపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. దసరా రేసులో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ లో ఉండగానే సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసినట్లు సమాచారం.

సుమారు 94 కోట్ల బిజినెస్ తో బాహుబలి 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా పీకే 25 రికార్డు క్రియేట్ చేసింది. 130 కోట్లతో బాహుబలి-2 ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, పవన్-త్రివిక్రమ్ సినిమా(94 కోట్లు), బాహుబలి-1(65.52 కోట్లు), ఖైదీ నంబర్ 150(32 కోట్లు), కాటమరాయుడు(61.5 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక జస్ట్ తెలుగు స్టేట్స్  లెక్కలు కాగా. వరల్డ్ వైడ్ గా సుమారు 120 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది 75 కోట్ల కలెక్షన్లతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా గా త్రివిక్రమ్ దీనిని రూపొందిస్తుండగా, పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  25th Movie  Trivikram  Pre Release Business  

Other Articles