Baahubali 2 Now An Inspiration for Makers

Baahubali 2 changed face of indian cinema

Baahubali Big Budget Movies, Baahubali 2 Ramayanam, Baahubali 2 Sangamithra, Baahubali 2 Inspiration, Baahubali Big Budget Movies, Baahubali Inspiration, Makers Baahubali Type Movies, Baahubali Assurance Big Budget Movies, Big Budget Movies India, Mahabharata Baahubali, Indian Big Budget Movies List

Baahubali 2 is turning an inspiration for makers who are hesitant of investing large sum of money into projects. Here is Some of Them.

బాహుబలి స్పూర్తితో మరిన్ని భారీ ప్రాజెక్టులు

Posted: 05/11/2017 12:16 PM IST
Baahubali 2 changed face of indian cinema

దేశంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఖ్యాతి సంపాదించిన బాహుబలి కలెక్షన్ల ద్వారా సృష్టిస్తున్న సునామీని కళ్లారా చూస్తున్నాం. ఓ ఇండియన్ రీజినల్ మూవీని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత ఖచ్ఛితంగా రాజమౌళికే దక్కుతుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లో వెయ్యి కొట్ల తొలి చిత్రంగా అరుదైన ఫీట్ ను సాధించటమే కాదు.. ఈ స్ఫూర్తితోనే వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు మేకర్లు.


రోబో 2.0...

బాహుబలి పార్ట్ 1 అప్పటిదాకా ఇండియాలో హయ్యెస్ట్ మూవీగానే ఉంది. దీంతో రజనీకాంత్ తో రోబో 2 తెరకెక్కించాలనుకున్న దర్శకుడు శంకర్ ఒకేసారి బడ్జెట్ ను అమాంతం పెంచేశాడు. సమారు 400 కోట్లతో దానిని తెరకెక్కిస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్థాయి టెక్నిషియన్స్ కు ఏడాదిన్నరగా చుక్కలు చూపిస్తూ మరో ఆరు నెలల్లో 2.0 ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ స్టార్ డైరక్టర్.

Shankar 2.0 Budget


సంఘమిత్ర....

కోలీవుడ్ నటుడు, నటి కుష్బూ భర్త, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం. దాదాపు 400 పై చిలుకు బడ్జెట్ తోనే ఇది రూపొందించబోతున్నారు. ముందుగా స్టార్ హీరోలను సంప్రదించగా వారు ధైర్యం చేయకపోవటంతో ఆర్య, జయం రవి లాంటి యూత్ ఫుల్ హీరోలతో ఈ సోషల్ ఫాంటసీ డ్రామాను తీస్తున్నాడు సుందర్. శృతీహాసన్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ చిత్రం 2019లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Sangamitra Movie Budget

మహాభారతం..

అంతా సక్రమంగా జరిగితే వెయ్యి కోట్ల తో దేశంలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ మహాభారతం రికార్డు సృష్టించటం ఖాయం. బి.ఆర్‌.శెట్టి నిర్మాతగా యాడ్ ఫిలిమ్ మేకర్‌గా పేరున్న వీఏ శ్రీకుమార్ మేనన్ ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన 'రండమోజమ్’ అనే నవల ఆధారంగా దీనిని తీయబోతున్నారు.

భీమసేనుడి దృక్కోణం నుంచి మహాభారతాన్ని వివరించిన నవల ఇది. రెండు బాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తొలి భాగం విడుదలైన మూడు నెలల్లోనే రెండో భాగాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లే ఈ చిత్రం తొలి భాగాన్ని 2020లో విడుదల చేయాలన్నది మేకర్స్‌ సంకల్పం. ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్‌, తెలుగులో రూపొందించి, మిగిలిన భారతీయ, పాశ్చాత్య భాషల్లోకి అనువదించనున్నారు. మళయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ భీముడి రోల్ పోషించబోతున్నాడు.

Mahabharat Mohanlal Budget

ఛత్రపతి శివాజీ...

మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ జీవితగాథను దృశ్యకావ్యంగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో ఈ బయోపిక్ ను తీస్తూ అందులో శివాజీ రోల్ ను కూడా తానే పోషించబోతున్నాడు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తోపాటు, మరో నటుడు వివేక్ ఒబేరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

Ritesh Deshmukh Sivaji Movie

రామాయణం...
టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ ఒక్కసారిగా చేసిన ప్రకటన కలకలం రేపింది. సుమారు 500 కోట్లతో రామాయణంను తెరకెక్కించబోతున్నారని అధికారిక ప్రకటన వెలువడింది. మూడు భాషల్లో అది కూడా త్రీడీలో మూడు భాగాలుగా మరో ఇద్దరు నిర్మాతలు మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా ముందుకు వచ్చారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ చిత్రానికి కాస్టింగ్ ఇతర వివరాలు ఇంకా తెలియజేయలేదు.

Allu Aravind Ramayanam


ఇవేగాక చిరు 151వ చిత్రం ఉయ్యలవాడకు వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాలని నిర్మాత రాంచరణ్ డిసైడ్ అయిపోవటం, షారూఖ్ ఖాన్ ఆపరేషన్ కుక్రీ సుమారు 350 కోట్ల బడ్జెట్ తో ఫ్లానింగ్, వర్మ దర్శకత్వంలో న్యూక్లియర్ సినిమా  దాదాపు 340 కోట్ల బడ్జెట్ తో (అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటిదాకా దాని విషయంలో పురోగతి లేదు) ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఏది ఏమైనా బాహుబలి ఇచ్చిన ధైర్యంతో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాల రూపకల్పనకు క్యూ కడుతున్నారు స్టార్ మేకర్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Big Budget Movies  India  

Other Articles