గురు కలెక్షన్ల గుంజుడు ఇప్పటితో ఆగదా? | Venky Guru Stable collections at box office.

Veky guru collections increased day by day

Venkatesh Guru Movie, Guru Movie Collections, Guru Movie Total Collections, Guru Movie Weekend Collections, Guru Katamarayudu Collections, Guru Cheliya Collections, Venkatesh Guru Hit, Guru Movie, Guru 2017 Movie, Guru Telugu Movie

Venkatesh Guru Movie four days total box office collections 11.5 Crores. In long run movie will ended with double profits.

గురు కలెక్షన్లు కుమ్ముకుంటున్నాడుగా...

Posted: 04/04/2017 04:19 PM IST
Veky guru collections increased day by day

టాలీవుడ్ లో ప్రస్తుతం వెంకటేష్ గురు హవా కొనసాగుతోంది. చివరిసారిగా ఫిబ్రవరిలో అబ్బాయి ఘాజీతో సక్సెస్ చూసిన టాలీవుడ్ మళ్లీ నెల తర్వాత బాబాయ్ సినిమాతోనే హిట్ ను అందుకుంది. రిలీజ్ తో డీసెంట్ టాక్ రాబట్టిన ఈ సినిమాకు బీ, సీ సెంటర్ లలో కలెక్షన్లు కొంచెం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ, మౌత్ టాక్ తో రాను రాను మరింత క్రౌడ్ ను రాబట్టుకుంటుందీ స్పోర్ట్స్ డ్రామా.

ఇక కలెక్షన్ల పరంగా కూడా గురు భారీగానే లాభాలు అందించబోతుందని స్పష్టం అవుతోంది. కాటమరాయుడుకు ఘోరంగా దెబ్బేసి మరీ వీకెండ్ లోనే 8 కోట్ల దాకా రాబట్టింది. సోమవారం 85 శాతం ఆక్యూపెన్సీతో దాదాపు అంతే కలెక్షన్లు రాబట్టడం విశేషం. వెంకీ లాంటి సీనియర్ హీరోకి ఇది పూర్ కలెక్షన్లే అయినప్పటికీ, బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా ఎక్కువే. ఇక బుధవారం శ్రీరామనవమి హాలీడే కావటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ వీకెండ్ లో మణిరత్నం చెలియా ఒకటే రిలీజ్ కాబోతుంది. మణి సినిమాలకు మాస్ సెక్షన్ పై అంత ప్రభావం చూపదు కాబట్టి ఈ వారం కూడా వెంకీ మ్యాజిక్ కంటిన్యూ కావొచ్చనే ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ లెక్కన మరో వారంపాటు గురు దే హవా కావటంతో 20 కోట్ల షేర్ దాకా కలెక్షన్లు వచ్చే ఛాన్సు ఉంది. బడ్జెట్ 10 కోట్లు కావటం, ఇప్పటికే 11.5 కోట్లతో లాభాల్లోకి ప్రవేశించటంతో  డబుల్ లాభాలు అందించబోతున్నాడన్న ఖాయమైంది. శాటిలైట్ రైట్లు 6 కోట్లకు, మిగతా రైట్లు కూడా మంచి రేటుకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. మొత్తం మీద లాంగ్ రన్ లో బయ్యర్లకు ప్రాఫిట్లతోనే గురు కలెక్షన్లను ముగించేలా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Guru Movie  Collections  

Other Articles