డబ్బు కోసం కాదు.. కిడ్నాప్ కు వేరే కారణం ఉందా? | Bhavana raised doubts on her kidnap and molestation.

Reason behind bhavana kidnap case

Actress Bhavana, Bhavana Kidnap and Rape Conspiracy, Bhavana Molestation, Bhavana Kidnap, Bhavana Doubts, Actress Bhavana Fight, Bhavana Case Real Culprits, Bhavana Open on Incident, Actress Bhavana Latest Interview, Bhavana Kidnap Case Twist

Actress Bhavana raised doubts on her kidnap and molestation.It was not for money cause there is a big conspiracy behind the scene she added.

భావన కిడ్నాప్ వెనుక పెద్ద కుట్ర ఉందా?

Posted: 04/04/2017 01:33 PM IST
Reason behind bhavana kidnap case

మళయాళీ భామ భావన కిడ్నాప్ మరియు లైంగిక దాడికి వెనుక కారణాలేంటో తేలీదుగానీ యావత్ దేశం మొత్తం ముక్త కంఠంతో దానిని ఖండించింది. మాములు మహిళలకే కాదు, ఓ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న భావన లాంటి వారికి కూడా సేఫ్ లేదని ఈ ఘటన నిరూపించింది. అయితే ఆ వెను వెంటనే ఇండస్ట్రీలో ఉన్న పలువురు హీరోయిన్లు సెక్సువల్ వేధింపులు చాలా కామన్ అంటూ పెను కలకలమే రేపారు.

ఇదిలా ఉంటే నెల రోజులపాటు అజ్నాతంలోకి వెళ్లిన భావన తర్వాత కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది కూడా. ఆ మధ్య తనకు అండగా నిలబడిన వారికి థ్యాంక్స్ అంటూ ఓ ట్వీట్ వేసింది కూడా. అయితే ఎక్కడ ప్రత్యక్షంగా ఘటన పై స్పందించలేదు. కానీ, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాత్రం దీనిపై పెదవి విప్పింది. ఈ నేరం వెనుక ఉన్న అసలు కారణాలేంటో నివృత్తి కావాల్సిన అవసరం ఉందంటూ ప్రశ్నిస్తోంది.

డబ్బు కోసమే ఇదంతా చేశామని నిందితులు చెబుతున్న కోణాన్ని తోసిపుచ్చిన ఆమె దాని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని చెబుతోంది. నాకు ఇండస్ట్రీలో శత్రువలున్నారన్న మాట మాత్రం వాస్తవం అని అంటోంది. కిడ్నాప్ వేధింపుల వెనుక ఉన్న అసలు కారణం ఏదైనా అది బయట పడేంత వరకు తాను మౌనంగా కూర్చోనని, అసలు నిందితులు బయటికి వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Bhavana  Kidnap and Molestation  New Doubts  

Other Articles