బాహుబలి కోసం మరో ఇంటర్నేషనల్ టెక్నిషియన్.. ఎవరో తెలిస్తే షాకవుతారు | Rajamouli to team up with Farmville game designer.

Farmville game designer for baahubali

Filmmaker S.S. Rajamouli, Rajamouli Baahubali, Baahubali Mobile game, Baahubali Moonfrog Labs, Baahubali Farmville and Lord of the Rings, Mark Skaggs Baahubali, Mark Skaggs Rajamouli

Filmmaker S.S. Rajamouli to create a "Baahubali" mobile game."Mark Skaggs (from Moonfrog Labs), creator of Farmville and Lord of the Rings games (among others) discussing the creation of 'Baahubali' mobile game with S.S. Rajamouli. Exciting stuff coming your way. Stay tuned," read a post on the official Facebook page of "Baahubali".

బాహుబలి గేమ్ కోసం ఇంటర్నేషనల్ టెక్నిషియన్

Posted: 02/09/2017 05:14 PM IST
Farmville game designer for baahubali

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి ది కంక్లూజన్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయన్నది తెలిసిందే. ఆ హైప్ ను అందుకునేందుకు అవుట్ ఫుట్ కూడా అదే స్థాయిలో ఇచ్చేందుకు తెగ కష్టపడిపోతాడు. ఇందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలటం లేదు. తాజాగా మరో అంతర్జాతీయ టెక్నిషియన్ ను బాహుబలిలో భాగస్వామిని చేయటం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

మార్క్ స్కాగ్స్.. ఆన్ లైన్ లో గేమ్స్ బాగా ఆడే వారికి ఈ పేరు పరిచయం ఉండే ఉంటుంది. అయినా ఓసారి ఆయన గురించి చెప్పుకుందాం. ఫార్మ్ విల్లే గేమ్ కు సూత్రదారి అయిన స్కాగ్స్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ బ్యాటిల్ ఫర్ మిడిల్ ఎర్త్ అనే మరో ఫేమస్ గేమ్ ను కూడా రూపొందించాడు. ఇక ఇప్పుడు బాహుబలి కోసం ఓ కొత్త గేమ్ ను రూపొందించాల్సిందిగా రాజమౌళి ఆయన్ని ఆహ్వానించాడు.

అంతర్జాతీయ సంస్థ మూన్ ఫ్రాగ్ ల్యాబ్ కి చెందిన మార్క్ స్కాగ్స్ ఈ గేమ్ ను రూపొందించబోతున్నాడు. మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి అంటూ బాహుబలి ఫేస్ బుక్ పేజీలో వారిద్దరి డిస్కషన్లు చేస్తున్న ఫోటోలను జక్కన్న టీం పోస్ట్ చేసింది. ఇప్పటికే బుక్, కామిక్, యానిమేటెడ్ సిరీస్ లతో బాహుబలి సినిమా స్థాయిని దాటించేసిన రాజమౌళి ఈ గేమ్ తో అంతర్జాతీయ మార్కెట్ పై కూడా కన్నేసినట్లు
క్లియర్ గా అర్థమౌతోంది.

ప్రస్తుతానికైతే పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లో బాహుబలి ది కంక్లూజన్ ఏప్రిల్ 28న విడుదలయ్యి తీరుతుందని అనౌన్స్ చేశాడు కూడా. తెలుగు, హిందీ, తమిళ్ మరియు మళయాళ భాషల్లో భారీ ఎత్తున్న బాహుబలి -2 రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mark Skaggs  Baahubali game  Rajamouli  

Other Articles