భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీ.. రిస్క్ చేస్తున్నాడా? | Prabhu Deva New Movie Yung Mung Sung.

Prabhu deva new movie details

Prabhu Deva, Prabhu Deva 2017, Prabhu Deva New Movie, Prabhu Deva Periodical Movie, Prabhu Deva Yung Mung Sung, Yung Mung Sung Movie, Yung Mung Sung Director, Yung Mung Sung Hero, Yung Mung Sung Story, Prabhu Deva Upcoming Movies

Prabhu Deva New period movie titled Yung Mung Sung. Deva will be seen as a martial arts expert in the film and it will be a comic entertainer.

పిరియాడికల్ మూవీ లో ప్రభుదేవా

Posted: 02/04/2017 10:50 AM IST
Prabhu deva new movie details

ఈ మధ్య అన్ని భాషల్లో వరుసబెట్టి పిరియాడికల్ చిత్రాలు వచ్చేస్తున్నాయి. భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు వెనకాడకపోవటం, పైగా కంటెంట్ ను నమ్ముతూ స్టార్ హీరోలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ఆ రిస్క్ కు క్రేజ్ కూడా అదే రేంజ్ లో ఉంటోంది. తెలుగులో మగధీర తర్వాత కొంచెం గ్యాప్ తోనే మళ్లీ వాటి ఊపు అందుకుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా చెర్రీ తీయబోయేది కూడా ఈ జోనర్ చిత్రమే.

ఇదిలా ఉంటే త్వరలో కోలీవుడ్ లో కూడా ఇలాంటి మరో భారీ చిత్రమే రాబోతుందంట. అయితే అందులో నటించబోయేది స్టార్ హీరో కానే కాదు. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో పీరియాడికల్ సినిమాను తీయబోతున్నాడు ఓ డెబ్యూ డైరక్టర్. శంకర్, బాల దగ్గర శిష్యరికం చేసిన ఎంఎస్ అర్జున్ అనే అసిస్టెంట్ డైరక్టర్ 1980 నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంట.

తమ ఊళ్లో నెలకొన్న సమస్యను పరిష్కారం కోసం ఓ తండ్రి తన కొడుకును కుంగు ఫూ నేర్చుకోవాల్సిందిగా చైనాకు పంపటం, అక్కడ ఆ యువకుడికి ఎదురయ్యే కష్టాలు, ఎలాగోలా ఆ విద్య నేర్చుకుని తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఉండబోతుందంట. యుంగ్ ముంగ్ సంగ్ పేరుతో తెరకెక్కబోతున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ షూటింగ్ ఈనెలలోనే ప్రారంభించుతున్నట్లు సమాచారం. కెమెరామెన్ కమ్ డైరక్టర్ తంగర్ బచ్చన్ ఓ కీలకపాత్ర పోషించబోతున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి టెక్నీషియన్స్ పనిచేయబోతున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhu Deva  Yung Mung Sung  Periodical Movie  

Other Articles