ఫుల్ గా తాగి షూటింగ్ వెళ్లి రచ్చ.. రచ్చ.. ఎవరా హీరోయిన్? | Heroine really drunk for a Movie.

Hansika says she got drunk for bogan

Actress Hansika, Hansika Bogan, Hansika Drink, Hansika Bogan Scene, Bogan Scenes, Hansika Bogan Movie, Hansika Drunk, Actress Drunk, Drunk Actress in Shooting, Kollywood Drunk Actress, Hansika in Bogan Sets

Hansika About Drunk Scene in Bogan. Kicked about her role in Bogan, which is in total contrast to what she had done in all her films so far, Hansika says, “You will see me doing some crazy stuff. For the first time, I got drunk for Bogan; a long sequence demanded that. It was shot in about 10 days. I did something else, which I haven’t done all these years.”

తప్పతాగి షూటింగ్ లో పాల్గొన్న హన్సిక

Posted: 02/03/2017 11:33 AM IST
Hansika says she got drunk for bogan

అందాల భామ హన్సిక గతేడాది నాలుగు తమిళ చిత్రాలతో సందడి చేసింది. అయితే అందులో ఓ ఒక్కటీ కూడా సక్సెస్ కాలేదు. ఈ యేడాది గ్యాప్ తర్వాత లక్కున్నోడు చేసినా లక్కు కలిసి రాలేదు. అయితే పట్టుమని పదిరోజులు కూడా తిరగక ముందే కోలీవుడ్ లో మరో సినిమాతో సందడి చేసింది. తనిఒరువన్ కాంబో జయం రవి-అరవింద స్వామిల బోగన్ నిన్ననే రిలీజ్ అయ్యింది. ఇందులో హన్సిక గ్లామర్ ఓ రేంజ్ లో పండించేసింది.

ఈ సినిమా షూటింగ్ లో ఓ రోజు ఫుల్ గా తాగి సెట్స్ కి వచ్చిందంట. ఈ విషయాన్ని స్వయంగా ప్రమోషన్ లో హన్సికనే చెబుతోంది. అయితే అది కేవలం ఓ సన్నివేశం కోసమేనని అంటోంది. బోగన్ లో ఓ సన్నివేశంలో హన్సిక డ్రింకింగ్ సీన్ లో నటించాల్సి వచ్చిందంట. ఆ సీన్ ను పండించడం కోసం హన్సిక నిజంగా తాగటానికి సిద్ధమైపోయింది. దర్శకుడు వద్దన్నా సరే ఓ రోజు గ్యాప్ ఇమ్మని చెప్పి నెక్స్ట్ డే ఫుల్ గా తాగి సెట్స్ కు వెళ్లిందంట.

ఆపై పది రోజులపాటు ఇలా తాగే సీన్ లో నటించేందుకు తాగుతూనే ఉందంట. మద్యం మత్తులో కొంచెం రచ్చ చేసినా, సీన్ మాత్రం అద్భుతంగా వచ్చిందని దర్శకనిర్మాతలు ఖుషీ అయ్యారని చెప్పుతోంది ఈ మిల్కీ భామ. కానీ, సినిమాలో ఈ డ్రింకింగ్ సీన్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, పాపం సినిమాకు మాత్రం నెగటివ్ రివ్యూలు రావటంతో తెగ ఫీలయిపోతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Hansika  Bogan  Drunk Scene  

Other Articles