ధోనీ హీరో ట్విట్టర్ లో ఎంత పని చేశాడు | Sushant Singh name 'Rajput' is no more.

Sushant singh drops rajput surname on twitter

Sushant Singh, Sushant Singh Rajput, Sushant Singh Sanjay Leela Bhansali, Sanjay Leela Bhansali Attack, Sushant Singh Padmavati, Sushant Singh Fire on Rajput, Sushant Singh Twitter

After Attack On Sanjay Leela Bhansali Sushant Singh Rajput Drops Surname From Twitter.

దర్శకుడిపై దాడికి నిరసనగా పేరు మార్చుకున్నాడు

Posted: 01/30/2017 10:41 AM IST
Sushant singh drops rajput surname on twitter

బాలీవుడ్ లో అగ్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దాడి రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఓ వర్గం వారిని కించపరుస్తూ పద్మావతి సినిమాను తెరకెక్కిస్తున్నాడంటూ రాద్ధాంతం చేయటం, ఆపై ఏకంగా బన్సాలీపై సెట్స్ లోనే చేయి చేసుకోవటం చూశాం. అది జరిగినా కొద్ది గంటల్లోనే హిందీ చిత్ర పరిశ్రమ ఒకేతాటిపైకి వచ్చి ఆ టాప్ దర్శకుడికి సంఘీభావం తెలపటమే కాదు, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ కూడా చేశారు.

మాములుగా అయితే ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సాహసించరు. ఎందుకంటే తమ సినిమాలపై వీటి ప్రభావం ఉంటుందన్న భయం ఉంటుంది. కానీ, అగ్ర, చిన్న తేడా లేకుండా అంతా ఈ దాడిని ఖండించారు. ఇక యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అయితే దీనిపై సీరియస్ అయ్యాడు. ధోనీ సినిమా ద్వారా పాపులర్ అయిన సుశాంత్ దాడి చేసింది తన కులం వారే కావటంతో ఇంకాస్త ఘాటుగా స్పందించాడు.

మనం ఏటు పోతున్నాం? అంటూ ఓ ట్వీట్ చేశాడు. మానవత్వం కన్నా పెద్ద మతం, కులం వేరే ఏదీ లేదు. అలాంటిది మరిచి ఇలా దాడులు చేయటం సరికాదంటూ తెలిపాడు. దీనికి నిరసనగా తన కులంపేరును తొలగించుకుంటున్నట్లు ప్రకటించాడు ఈ 31 ఏళ్ల యువ హీరో. అయితే కాసేటికే తిరిగి మళ్లీ రాజ్ పుత్ పేరు చివర దర్శనమివ్వటం విశేషం. మరో దర్శకుడు అనురాగ్ కశ్యప్, చిత్రంలోని హీరో హీరోయిన్లు షాహిద్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునేలు కూడా దీనిపై తమ అంసతృప్తిని వ్యక్తం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushant Singh  Twitter  Surname Name  

Other Articles