బాహుబలి-2 జస్ట్ 99 డేస్... | baahubali 2 100 days to go.

Baahubali making his way to the big screen

Baahubali The Conclusion, Baahubali-2, Baahubali 2, Baahubali 2 promotions, Baahubali the conclusion, Baahubali The Conclusion countdown, Baahubali 2 100 days, baahubali 2 100 days to go, Baahubali 2 release date

Baahubali The Conclusion countdown begins. Exact 100Days To Baahubali-2.

బాహుబలి-2 ఇక నుంచి రోజు వార్తల్లో...

Posted: 01/19/2017 03:12 PM IST
Baahubali making his way to the big screen

ఒక ప్రాంతీయ చిత్రం(తెలుగు) నుంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమయ్యే స్థాయికి చేరటమే కాదు, వసూళ్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది బాహుబలి ది బిగినింగ్. కట్టి పడేసే విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ స్క్రీన్ ప్లే, చివర్లో కట్టప్ప పజిల్ ఇవన్నీ రెండో పార్ట్ పై అంచనాలు పెంచితే, వాటికి ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించానని రాజమౌళి హామీ ఇచ్చాడు.

ఏది ఏమైతేనేం మొత్తానికి షూటింగ్ అయిపోగొట్టి, పోస్ట్ ప్రోడక్షన్ పనిలో తెగ బిజీ అయ్యాడు జక్కన్న. ఇక కంక్లూజన్ విడుదలకు ఇంకెన్నో రోజులు లేదు. సరిగ్గా 100 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 28న బాహుబలి వెండితెరపై సందడి చేయబోతుంది. అందుకే కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది. ‘బాహుబలి కౌంట్ డౌన్ స్టార్ట్స్’ అనే హ్యాష్ ట్యాగ్ లతో ట్విట్టర్లో సందడి చేస్తున్నారు.

‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలకు ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు చిత్ర యూనిట్. రానా దగ్గుబాటితో సహా చాలామంది సెలబ్రెటీలు కూడా ఇందులో భాగమయ్యారు. బాహుబలి-2 కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది చెబుతూ అభిమానులు తమ ఎగ్జైట్మెంట్ ను పంచుకున్నారు. ఇక మిగిలింది ప్రతీరోజూ సినిమాను వార్తల్లో నింపి ఆ అంచనాలను నింగికి చేర్చటమే చేర్చటమే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahubali 2  Count Down  Release date  promotions  

Other Articles