బాహుబలి గురించి మళ్లీ... థర్టీ ఇయర్స్ కి వేరే పనిలేదా? | Comedian again speaks about his role in Baahubali 2.

Comedian prudhvi again about his role in baahubali 2

Comedian Prudhvi, Prudhvi role in Baahubali, Prudhvi Baahubali 2, Baahubali the Conclusion, Baahubali 2 roles, Prudhvi again Baahubali-2, Baahubali-2, 30 years prudhvi, Anushka minister actor, Baahubali Prushvi

Star Comedian Prudhviraj Again speaks about his role in Baahubali the Conclusion.

బాహుబలి-2 రోల్ ఎన్నిసార్లు చెబుతాడు?

Posted: 01/18/2017 01:10 PM IST
Comedian prudhvi again about his role in baahubali 2

ప్రెస్టీజియస్ ప్రాజెక్టు బాహుబలి గురించి మాట్లాడని స్టార్లు ఎవరైనా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సూర్య లాంటి హీరోలైతే ఏకంగా ఒక్క ఛాన్స్ అంటూ రాజమౌళిని స్టేజీపైనే రిక్వెస్ట్ చేయటం కూడా చూశాం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని ఏ ఎలిమెంట్ ను బయటకు రానీయకుండా చిత్ర దర్శకుడు రాజమౌళి ఎంత కేర్ తీసుకుంటున్నాడో మనకు తెలిసిందే. కానీ, నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ మాత్రం తన రోల్ ఏంటో ఓపెన్ గా చెప్పేస్తున్నాడు.

బాహుబలి ది కంక్లూజన్ లో తాను ఓ పాత్రలో కనిపించబోతున్నానని, తనకూ ఓ మంచి పాత్ర రాజమౌళి ఇచ్చారని చెప్పి వార్తల్లో నిలిచాడీ బాయిలింగ్ స్టార్. అనుష్క చేసిన రాణి దేవసేన పాత్రకు మంత్రిగా కనిపిస్తాను. ఇప్పటివరకూ కామెడీ పాత్రలతో కనిపించినా, ఈసారి సీరియస్ రోల్ చేస్తున్నా అంటూ వివరించాడు. అయితే ఈ విషయం ఏం కొత్తది కాదు, అజయ్ ఘోష్ అనే నటుడు బందిపోటు పాత్రలో కనిపిస్తాడని చెప్పుకున్న సమయంలోనే, పృథ్వీ కూడా మంత్రి రోల్ చేస్తున్నాడంటూ చెప్పేసుకున్నాడు. అంతేనా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఇదే స్టేట్ మెంట్ చాలా సార్లే ఇచ్చుకున్నాడు కూడా.

అయితే తాజాగా ఖైదీ నంబర్ 150లో తన రోల్ గురించి రచ్చ చేసిన పృథ్వీ, ఎవరూ అడగకపోయినా... బాహుబలి స్పూఫ్ చేశానని రాజమౌళి తనను తిట్టలేదని ఓసారి, నారాయణమూర్తి కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా థియేటర్ల ఇష్యూ గురించి ఓసారి, ఇక ఇప్పుడు బాహుబలి-2 రోల్ ఇలా ఏదో ఒక స్టేట్ మెంట్ తో రోజూ వార్తల్లో నిలుస్తున్నాడన్నది మాత్రం స్పష్టమైపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 30 years Prudhvi  Baahubali-2  role  

Other Articles