దంగల్ లీగల్ యుద్ధం- ఆయన్ని తప్పుగా చూపించాం.. అది మాములే... | Aamir ‘Dangal’ has irked former wrestling coach .

Aamir khan on geetha coach negative portrayal

Dangal Legal Battle, Coach PR Sondhi, Dangal war, Dangal Coach, Geeta Phogat's former coach, Legal Sue for Dangal, Dangal in Legal trouble, Geeta Phogat coach, Dangal negative portrayal, Geeta Phogat Dangal, Geeta Phogat's Trainer PR Sondhi, Geetha coach not happy with dangal, Aamir dangal Dramatized, Aamir admits mistake in Dangal, Dangal week collections

Geeta Phogat's former coach PR Sondhi is contemplating suing Dangal for negative portrayal, Aamir says it is common in Biopic.

బయోపిక్ లో అలాంటివి సహజమే!: అమీర్

Posted: 12/30/2016 01:32 PM IST
Aamir khan on geetha coach negative portrayal

బాలీవుడ్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. ఓ బయోపిక్ ను తన ఇష్టానుసారం మార్చుకునే హక్కు ఉందంటూ వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశాడు మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్. మల్లయోధుడు అయిన మహావీర్ ఫోగట్ తన కూతుళ్లను ఎలా ఛాంపియన్లుగా మార్చాడో దంగల్ లో చూపించాడన్నది తెలిసిందే. ఈ క్రమంలో స్వేచ్ఛతోపాటు వివాదానికి తెరలేపాడు.

2010 ఢిల్లీ కామన్ వెల్త్ క్రీడల్లో గీతా గోల్డ్ మెడల్ సాదించింది. ఆ సీన్ ను మార్చి దర్శకుడితో ఎమోషనల్ గా తీయించాడు అమీర్. ఆ విషయంలో ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా... ఏకంగా ఆమె కోచ్ ను నెగటివ్ చూపించటమే తీవ్ర విమర్శలకు దారితీసింది. రియల్ కోచ్ పీఆర్ సోథి ఈ మేరకు అమీర్ పై తీవ్ర విమర్శలు కూడా చేశాడు. సినిమాలో తన పాత్రను అవమానించారని, అహం ఉన్న వ్యక్తిగా, పబ్లిసిటీ కోసం పాకులాడే వ్యక్తిగా చిత్రీకరించాడని ఆరోపించాడు.

అంతేకాదు దంగల్ యూనిట్ కు నోటీసు కూడా పంపాడు. దీనిపై అమీర్ స్పందిస్తూ బయోపిక్ ను ఉన్నది ఉన్నట్లుగా ఎవరూ తీయలేరు. దానికి ఖచ్ఛితంగా కాస్త కల్పితం జోడించాల్సిందే. దంగల్ లో దానిని కాస్త కఠినంగా చూపించాల్సి వచ్చిందంటూ తెలిపాడు. మరి ఈ వ్యవహారనికి ఎలా ముగింపు పలుకుతాడో చూడాలి. కాగా, అంతా అద్భుతమైన రివ్యూలు రావటంతో దంగల్ నోట్ల సమస్యను పక్కనపెట్టి కలెక్షన్లతో దూసుకెళ్లిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dangal movie  Geeta Phogat  Coach PR Sondhi  Legal Proceedings  

Other Articles