ఖబడ్దార్... తూచ్... చిరు నాకు ఆదర్శం.. అలా ఎందుకు అంటాను? | Khabardar not belongs to Mega Family.

Krish reacts on khabardar controversy

Director Krish, Krish Mega Family, Krish Khabardar, Khabardar Comments, Satakarni Krish Speech, Krish speech at Gautamiputra Satakarni Audio, Krish Chiru, Krish balayya, Krish Cherry

Director Krish puts an end to rumors on 'Khabardar' comment made at Satakarni Audio Launch.

మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి-క్రిష్

Posted: 12/28/2016 01:32 PM IST
Krish reacts on khabardar controversy

గౌతమీపుత్ర శాతకర్ణి కోసం బాలయ్య అభిమానులే కాదు. టోటల్ టాలీవుడ్ మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. నటసింహ వందో లాండ్ మార్క్ చిత్రం కావటంతోపాటు, తెలుగు జాతి గౌరవాన్ని గర్వంగా ఎగరేసిన రారాజు శాతకర్ణి జీవిత చరిత్ర కావటం, పైగా ట్రైలర్ భారీ గ్రాఫిక్స్ లతో, డైలాగులతో ప్రామిసింగ్ ఉండటంతో అంచనాలు బారీగా నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఆడియో వేడుక శాతకర్ణి వైభవాన్ని చాటింది. ముఖ్యంగా క్రిష్, బాలయ్య స్పీచ్ లు కట్టిపడేశాయి. ఓ తెలుగు చక్రవర్తి జీవిత చరిత్ర మనకు తెలీకపోవటం దౌర్భాగ్యమని, ఇదే హాలీవుడ్ లో అయితే ఓ పది సినిమాలు, మూడు అస్కార్ లు వచ్చేవంటూ బాగానే మాట్లాడాడు దర్శకుడు క్రిష్. అయితే చివర్లో చేసిన కామెంట్లే పెద్ద రచ్చగా మారిపోయాయి. ఎమోషనల్ అయిన క్రిష్ ఒక్కసారిగా ‘‘సమయం లేదు మిత్రులారా, సంక్రాంతికి సినిమా. ఖబడ్దార్’’ అంటూ గట్టిగా నినందించాడు.

 

అంతే శాతకర్ణి కి కాంపీటిషన్ గా ఉంది ఖైదీ నంబర్ 150 కావటంతో ఆటోమేటిక్ గా సీన్ అంతా మరోలా మారిపోయింది. తమకే వార్నింగ్ ఇస్తాడా? అంటూ మెగా అభిమానులు సీరియస్ అయిపోయారు. సోషల్ మీడియా లో క్రిష్ పై తిట్ల దండకం వల్లించారు. పరిస్థితి అదుపు తప్పక ముందే సీన్ లోకి ఎంటర్ అయిన క్రిష్ పరిస్థితి చక్కదిద్దే యత్నం చేశాడు.

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరించాడు. మెగా ఫ్యామిలీ హీరోలకు తాను గౌరవం ఇవ్వటమే కాదు, చిరుకు తాను కూడా అభిమానినంటూ చెప్పుకొచ్చాడు. సినిమాల్లోకి రావటానికి మెగాస్టార్ తనకు ఆదర్శమని, ఒకసారి ఇంటికి ఆహ్వానించాడని, కంచె సమయంలో అభినందించాడంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమాల్లోకి రాకముందు నుంచే చిరు తనయుడు చెర్రీ తనకు మంచి స్నేహితుడని తెలిపాడు. తన రెండో చిత్రం వేదంలో అల్లు అర్జున్ హీరో అని, తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కంచెలో కూడా మెగా వారసుడు వరుణ్ తేజే హీరో అని గుర్తు చేస్తున్నాడు. శాతకర్ణి ద్వారా తెలుగు జాతి చరిత్రని మరిచిపోయిన తెలుగువాళ్ళకు సవాల్ అని స్పష్టంచేశాడు. తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటుతుందన్న ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప.. ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని క్లియర్ గా చెప్పేశాడు క్రిష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Krish  Satakarni Audio Launch  Khabardar Comments  Mega family  

Other Articles