వర్మ గురించి ఓపెన్ గా మాట్లాడారా? బోర్ కొట్టించారా? | Celebs opined on Varma in Shiva to Vangaveeti meet

Shiva to vangaveeti meet details

Shiva to Vangaveeti meet, Ram Gopal Vamra's Vangaveeti, Vangaveeti pre release function, Nag speech at Shiva to Vangaveeti meet, Venky speech at Shiva to Vangaveeti meet, Rajamouli about RGV, Celebs at Shiva to Vangaveeti meet, Celebrities about Ram Gopal varma

Ram Gopal Vamra's Shiva to Vangaveeti meet details.

శివ టు వంగవీటి వేడుక ఎవరెమన్నారు?

Posted: 12/21/2016 09:30 AM IST
Shiva to vangaveeti meet details

ట్విట్టర్ లో ఒకడు నువ్వు చావని పామురా అని కామెంట్ చేశాడు. పోయాడు అనుకుంటే మళ్లీ వస్తావు. మనిషివా? దెయ్యానివా? అంటూ కామెంట్ చేశాడు. అవును.. నేను నిజంగానే చావని పాముని దానికి కారణం నాగ్ అని అంటున్నాడు వర్మ. వంగవీటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా శివ టూ వంగవీటి జర్నీ పేరిట నిర్వహించిన ఈవెంట్ లో వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాసులు ఎగ్గొట్టి, సినిమా థియేటర్లలో గడపడంతో రెండు సార్లు ఇంజనీరింగ్ పరీక్ష తప్పానని వర్మ తన గురించి వేసిన టీజర్ లో తెలిపాడు. పిచ్చిపిచ్చిగా రోడ్లపై రాడ్లు పట్టుకుని తిరిగే గ్యాంగుల్లో ఉంటూ వారిని గమనిస్తూ జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. కొన్నేళ్ల తరువాత ఆనాటి తన అనుభవాలకు కథ జోడించి నాగార్జున్ ఇచ్చిన బ్రేక్ తో 'శివ' సినిమా తీశానని అన్నాడు.

ఆ సినిమా రిలీజైన తరువాత 'తీస్తే ఇలాంటి సినిమాయే తీయాలనుకునే' దర్శకులు, 'చేస్తే ఇలాంటి క్యారెక్టరే చేయాలనుకునే హీరోలు', 'రాస్తే ఇలాంటి కథే రాయాలనుకునే రచయితలు', 'చూస్తే ఇలాంటి సినిమానే చూడాలనుకునే ప్రేక్షకుల'ను సంపాదించుకుని, 'క్షణక్షణం', 'అంతం', 'దెయ్యం', 'అనగనగా ఒకరోజు', 'రంగీలా', 'సత్య', 'కంపెనీ', 'భూత్', 'సర్కార్' వరకు చేరుకున్నానని అన్నాడు. విజయవాడలో కాలేజీ ఎగ్గొట్టి 'జంజీర్' సినిమా చూసి స్పూర్తి పొందిన తాను, ఆ సినిమా హీరో అమితాబ్ ను చేరుకుని, ఆయననే ముఖ్యఅతిథిగా ఈ ఫంక్షన్ కు ముంబై నుంచి హైదరాబాదుకు రప్పించడం గర్వంగా ఉందని రాంగోపాల్ వర్మ తెలిపాడు. తనకే బ్రేక్ ఇచ్చిన నాగార్జునకు, తనలో స్పూర్తిని రగిలించిన అమితాబ్ కు ధన్యవాదాలు తెలిపాడు.

‘‘నా చివరి తెలుగు సినిమా ‘వంగవీటి’ అని చెప్పాను. అన్నమాట మీద నేను నిలబడనని అందరికీ తెలుసు. ఇప్పుడు నాలో నిజాయితీ మెరుగువుతోంది. ముందు ముందు నేను గర్వంగా చెప్పుకొనే సినిమాలే చేస్తాను. రాజమౌళికి నేనిస్తున్న వాగ్దానమిది. నామీద నేనే ఒట్టేసుకొని చెబుతున్నా. నాకు నాకన్నా ఇంకెవరూ ఇష్టం లేదు. ఆ ప్రామిస్‌ ఇవ్వగలను’’ అని చెప్పారు రామ్‌గోపాల్‌వర్మ.

‘‘విజయవాడలో చదువుకునేప్పుడు వంగవీటి రంగా ర్యాలీ చూశాను. గాంధీని హత్యచేసినప్పుడు అక్కడికి వెయ్యి గజాల దూరంలోనే ఉన్నాను. సినిమాల్లో నేను వయొలెన్సను టేకప్‌ చేయడానికి ఉన్న కారణాలవి. ‘శివ’ కథకూ, ‘వంగవీటి’ కథకూ సంబంధం లేదు. ఇన్నేళ్ల తర్వాత ‘వంగవీటి’ని ఎందుకు తీశానంటే, ఇప్పటిదాకా దాన్ని తియ్యాలనే ఆలోచన నా మస్తిష్కంలోకి రాలేదు కాబట్టి. దాన్ని తియ్యడానికి ఓ విధమైన పరిణతి కావాలి. ఇందులో ప్రతి చిన్న పాత్రా వివరంగా ఉంటుంది. దర్శకుడు స్వేచ్ఛగా తాననుకున్నది అనుకున్నట్లు తీయగలిగినప్పుడే దానికో స్టాంప్‌ ఉంటుంది. హిట్‌ తీసినంత మాత్రాన అది రాదు. నాగార్జున నన్ను నమ్మి, నా వెనుక నిల్చొని ‘శివ’ చేశాడు’’ అని వర్మ వివరించాడు.


సక్సెస్ యాక్సిడెంటల్.. ఫ్లాపులు ఇన్సిడెంటల్...

సినీ పరిశ్రమ చెన్నయ్ లో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లందరూ దర్శకుడుకి 'నమస్కారం సర్, గుడ్ మార్నింగ్ సర్' అని తప్పనిసరిగా చెప్పాలనే రూల్ ఉండేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. అయితే అలా చెప్పించుకోవడం రాంగోపాల్ వర్మకు అస్సలు ఇష్టం ఉండదని తెలిసిందని, దీంతో హైదరాబాదు వచ్చాక ఆయనకు ఆ రెండు చెప్పకుండా విష్ చేసేందుకు చాలా ప్రాక్టీస్ చేశానని అన్నారు. రామూగారు చాలా కాలం తరువాత వంగవీటిని బాగా ప్రమోట్ చేస్తున్నారని రాజమౌళి తెలిపారు. 'రామూగారూ ఈ సినిమాలు ఎలా తీశారు?' అని అడిగితే 'విజయాలన్నీ యాక్సిడెంటల్ గా వచ్చాయని, ఫ్లాపులన్నీ ఇన్సిడెంటల్' అని అనేవారని, అది ఆయనలాగే అర్థం కాదని రాజమౌళి తెలిపారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

నాగ్.. వెంకీ ఏమన్నారు
తనకు ఎప్పుడైనా బోర్‌ కొట్టినా, డిప్రెషన్‌లోకి వెళ్లినా.. రాము ట్విట్టర్‌ అకౌంట్‌ చూస్తానని నాగ్ తెలిపాడు. మనసులో అనుకున్నది చెప్తావు రామూ.. నువ్వు ఎలా బతుకుతున్నావో అలాగే బతుకు. అసలు మారకు అని నాగ్ అన్నారు. 'శివ టు వంగవీటి' గురించి చెప్పాలంటే చాలా ఉంటుందని ప్రముఖ నటుడు వెంకటేష్ అన్నారు. 'శివ' తెలుగు సినీ పరిశ్రమ పోకడను మాత్రమే కాదని, భారతీయ సినీ పరిశ్రమ పోకడను పూర్తిగా మార్చేసిందని అన్నారు. 'ఆ తరువాత తనతో సినిమా తీస్తానని వర్మ చెప్పగానే, 'శివ'కి బాబు లాంటి సినిమా తీస్తాడనుకున్నాను... 'శివ'లో నాగార్జునను పరుగెత్తించాడు, అలాంటిది 'క్షణక్షణం'లో నన్నేమో కూర్చేపెట్టేవాడు' అంటూ నవ్వుతూ చెబుతూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. వీడేంట్రా బాబు నాగార్జునను పరుగెత్తించాడు. నన్ను కూర్చోబెడుతున్నాడని అనుకునేవాడినని అన్నారు. ఎలా అయితేనేం ఒక డిఫరెంట్ జానర్ లో అద్భుతమైన సినిమాను తనకు ఇచ్చాడని ఆయన కితాబునిచ్చారు.

వర్మ వంగవీటి తరువాత సినిమాలు తీయడం మానేస్తానని ప్రకటించాడని, అయితే అది వదంతి అని అనుకుంటున్నానని అన్నాడు. అలా కాకుండా ఆయన అలాంటి నిర్ణయమే కనుక తీసుకుంటే, ఆయన ఇంటి ముందు దర్శకులంతా కలసి ధర్నా చేస్తామని ప్రకటించాడు. 'శివ టు వంగవీటి' వరకు వర్మ జర్నీ ఆసక్తికరమని గుణశేఖర్ తెలిపాడు. ఇక సీనియర్ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. సినిమాలకు గుడ్ బై చెబుతాడంటూ తోటి దర్శకులు మాట్లాడుతున్నారు. అదే జరిగితే రాజమౌళి, పూరీ, చౌదరి మేమంతా చైన్ లు పట్టుకుని వస్తాం. సినిమాలు కావాలో, చైన్ దెబ్బలు కావాలో డిసైడ్ చేసుకో అంటూ వర్మకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడాయన. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రియ శిష్యుడు పూరీ, మరో శిష్యుడు హరీష్ శంకర్, వైవీఎస్ చౌదరీ, బోయపాటి శీను, వంశీపైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiva to Vangaveeti meet  Celebrities about Ram Gopal varma  

Other Articles