షారూఖ్ కి రాయిసే లాస్ట్ చిత్రమా? | No actions from SRK in Future.

Raees srk last action flick

Sharukh Khan Raees, Sharukh Khan Knee Injury, Sharukh Khan Leg Surgery, Sharukh Khan Knee Operation, Sharukh Khan Leg, Sharukh Khan Action scenes, No Action stunts for SRK, SRK surgery, SRK Raees Last Movie

Sharukh Khan goes under knee Surgery. No Actions stunts in future.

షారూఖ్ మున్ముందు రిస్క్ చేస్తే కష్టమే

Posted: 12/10/2016 03:01 PM IST
Raees srk last action flick

ఇక్కడ చెప్పుకోబోయేది రాయిస్ సినిమా విడుదల గురించి కాదు. ప్రస్తుతం షారూఖ్ ఆరోగ్య పరిస్థితి గురించి. కొంతకాలంగా షారూఖ్ ను ఇబ్బంది పెడుతున్న మోకాలి నొప్పి గురించి. యాక్షన్ సన్నివేశాలకు తరచూ డూప్ లేకుండా చేసే షారూఖ్ కి దెబ్బలు తగిలించుకోవటం అలవాటుగా మారిపోయింది.

ఈ క్రమంలో న్యూ ఇయర్ చిత్ర సందర్భంగా ఓ గాయం కాగా, గతేడాది మోకాలికి ఓ మైనర్ చికిత్స కూడా చేయించుకున్నాడు. అయితే ఆ గాయం మళ్లీ తిరగబడటంతో షారూఖ్ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఎలాగోలా రాయిస్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన షారూఖ్ ట్రైలర్ లాంఛింగ్ సందర్భంగా కాలికి ఓ బ్యాండ్ తో వచ్చాడు. స్టైల్ గా వచ్చేడేమో అనుకున్న మీడియాకు పెద్ద షాకే ఇచ్చాడు.

త్వరలో ఓ మేజర్ సర్జరీకి రెడీ అయిపోతున్నాడు. వరుసగా సినిమాలు చేసి తీరిక లేకపోవటంతో ఇన్నాళ్లు అందుకు విముఖత చూపిన షారూఖ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. దీంతో వచ్చే ఏడాది మొదట్లో షారూఖ్ కి శస్త్రచికిత్స చేయించుకునేందుకు రెడీ అయిపోతున్నాడు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దేశాయ్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ నిర్వహించనున్నాడు. అనంతం 8 నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన వచ్చే ఏడాది షారూఖ్ కొత్త సినిమాలేవీ చేయడు. ఆ తర్వాత చేసినా అందులో యాక్షన్ సన్నివేశాలు ఉండవు. ఆ లెక్కన రాయిస్ షారూఖ్ లాస్ట్ యాక్షన్ పిక్చర్ అన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahrukh Khan  Raees  Action Stunts  SRK Knee Surgery  

Other Articles