ఆరేళ్ల లవ్ స్టోరీకి రాక్ స్టార్ పుల్ స్టాప్ | End Story for Sandalwood couple six years love.

Radhika pandit and yash tie the knot

Kannada actors, Yash and Radhika Pandit, Rocking Star Yash, Actress Radhika Pandit, Rocking Star wedding, Yash wedding pics, Radhika Pandit Yash relation, Kannada Rocking Star Yash, Hero Yash wife, celebs at ash Radhika wedding

Kannada actors Yash and Radhika Pandit tie the knot in a dream wedding.

మరో సినీ సెలబ్రిటీ జంట పెళ్లి చేసేసుకున్నారు

Posted: 12/10/2016 09:53 AM IST
Radhika pandit and yash tie the knot

సౌత్ లో మరో సినీ సెలబ్రిటీ జంట ఒక్కటయిపోయింది. కన్నడలో రాకింగ్ స్టార్ గా పాపులరిటీ ఉన్న యశ్, హీరోయిన్ రాధిక పండిత్ పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్ లో శుక్రవారం గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. శాండల్ వుడ్ ఆర్ట్ డైరక్టర్ అరుణ్ సాగర్ నేతృత్వంలో బృందం భారీ సెట్ తో కల్యాణ వేదికను నిర్మించింది.

ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండటమేకాదు, అరడజను హిట్ సినిమాలు కూడా వీరిఖాతాలో ఉన్నాయి. నంద గోకుల్ అనే సీరియల్ ద్వారా ఇద్దరు కెరీర్ ను ప్రారంభించగా, ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఆరేళ్లుగా వీరు రిలేషన్ లో ఉండగా, ఇటీవలె పెద్దలు వారి వివాహానికి ఓకే చెప్పారు. రాధిక పండిత్ తండ్రి కృష్ణకుమార్ పండిత్ యశ్‌ను కల్యాణ మంటపానికి తీసుకురాగా, అక్కడ భారీగా ప్రతిష్టించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామి వద్ద యశ్ ఆశీర్వాదం పొందారు. అనంతరం రాధిక పండిత్‌ను కూడా తండ్రి కృష్ణకుమార్ పండిత్ కల్యాణ మండపానికి తీసుకు వచ్చారు. అంతకు ముందు గౌరీపూజ నిర్వహించారు.

యువ జోడిని ఆశీర్వదించడానికి ప్రముఖులంతా భారీగా తరలివచ్చారు. మాజీ సీఎం ఎ.ఎం. కృష్ణ, మాజీ మంత్రులు వీ.సోమన్న, చెలువరాయస్వామి, జమీర్ ఆహ్మద్‌ఖాన్, కన్నడ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు రవిచంద్రన్, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర, రాజ్‌కుమార్, సుదీప్‌తో పాటు శాండిల్ ఉడ్ తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. శ్రీనాథ్ దంపతులు, దొడ్డణ్ణ, సీనియర్ నటి భారతి విష్ణువర్ధన్, దర్శకుడు పవన్ ఒడెయార్, ఏ.పి. అర్జున్, మహేష్‌రావు, నిర్మాత జయణ్ణ, మంజు, జయ కర్ణాటక అధ్యక్షుడు ముత్తప్ప రైతో పాటు పలువురు పెద్దలు కొత్త దంపతులను ఆశీర్వదించారు.

కాగా, ఈ మధ్యే మళయళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ కావ్యా మాధవన్, హీరో దిలీప్ ను పెళ్లి చేసుకోగా, టాలీవుడ్ లో సమంత-నాగ చైతన్యలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kannada  Yash And Radhika wedding  

Other Articles