యాక్సిడెంట్ అయ్యింది మరి వరుణ్ ఏం చేస్తున్నాడు? | Varuntej wants entertainment after accident

Accident megahero experiments with his selfies

Mega Hero, Mega Hero Experiments with selfies, Varun tej Selfie talent, Varntej accident, Megahero accident

Mega Hero Experiments with selfies Varun tej after met accident in During Mister movie shooting.

యాక్సిడెంట్ అయిన మెగా హీరో పనిలేక...

Posted: 10/08/2016 01:34 PM IST
Accident megahero experiments with his selfies

ఎడతెరిపి లేకుండా షూటింగ్ లో పాల్గొనే నేటి తరం హీరోలకు కాస్త గ్యాప్ దొరికిందంటే చాలూ ఎక్కువ సమయం ఫ్యామిలీతోనే గడిపేస్తుంటారు. సీనియర్ హీరోలు తమ ఫ్యామిలీస్ తో విదేశాలకు చక్కేస్తుంటే, కుర్రహీరోలు మాత్రం సోషల్ మీడియాలో తన జాలీడే కబుర్లను పంచుకుంటుంటారు.  ఎప్పుడూ బిజీగా వుండే మనుషులు హఠాత్తుగా ఇంట్లో ఖాళీగా ఉండాలంటే కష్టమే. పైగా మెగా హీరో వరుణ్ తేజ్ లాంటి యూత్ హీరోలకు మరీనూ.

ఇటీవల ఊటీలో 'మిస్టర్' సినిమా షూటింగులో ఈ యంగ్ హీరోకి యాక్సిడెంట్ అయిన సంగతి విదితమే. దాంతో షూటింగ్ కేన్సిల్ చేసుకుని హైదరాబాదుకి వచ్చేశాడు. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇవ్వడంతో మనవాడు ఇంట్లో బెడ్ కి పరిమితమయ్యాడు. అదే ఇప్పుడు తనకి తెగ బోర్ కొట్టేస్తోందని అంటున్నాడు. ఏమీ తోచక మొబైల్ ఫోన్ లో బ్యాట్ మేన్ బొమ్మలు గీస్తూ ... తన సెల్ఫీలతో కొత్త ప్రయోగాలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నాడు.

అంతేకాదు, 'కాలు కదపలేకపోతున్నాను ..మంచానికి అతుక్కుపోయాను ... బోర్ కొట్టేస్తోంది.. ఎంటర్ టైన్మెంట్ కావాలి ..' అంటూ ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టి, తన బాధను అభిమానులకు చెప్పుకున్నాడు. త్వరలో వరుణ్ పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగుల్లో పాల్గొనాలని అభిమానులు ఆశిస్తున్నారు. మిస్టర్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుండగా, అందులో రిచ్ కిడ్ పాత్రలో కనిపించబోతున్నాడంట ఈ మెగా హీరో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega Hero  Varun tej  Selfie experiments  

Other Articles