బతుకు జట్కా బండిపై పోలీసు కేసు నమోదు | Case registered against Jeevitha's assistants for threatening person to attend Bathuku Jetka bandi

Case registered against jeevitha assistants for threatening

Jeevitha Bathuku Jetaka Bandi, Police Case against popular TV show, Case against on Jeevitha's TV show, Case on Jeecitha's Show, Bathuku Jatka Bandi, Jeevitha assistants arrested, Case on Bathuku Jatka Bandi

Case registered against Jeevitha's assistants for threatening person to attend Bathuku Jetka bandi.

బతుకు జట్కాబండి షో పై సంచలన ఆరోపణలు

Posted: 09/27/2016 10:37 AM IST
Case registered against jeevitha assistants for threatening

వ్యక్తిగత జీవితంలోకి దూరి మరీ వారిని, వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ టీవీషోల ద్వారా టీఆర్పీ పెంచుకుంటున్నాయి కొన్ని చానెళ్లు. అందులో ఒకటే నటి జీవితా రాజశేఖర్ యాంకరింగ్ లో వస్తున్న బతుకు జట్కాబండి. నిజానికి ఈ కార్యక్రమానికి ఒకప్పుడు ఆదరణ బాగానే ఉండేది. అప్పట్లో సీనియర్ నటి సుమలత హోస్ట్ గా చేసిన ఈ ప్రోగ్రాం, కుటుంబ కలహాలతో విడిపోతున్న జంటలు, ఆయా సమస్యల పరిష్కారానికి అప్పుడు చాలా వరకు సహకరించింది. రెక్కాడితేకాని డొక్కాడని బ్రతుకులతో ఉన్న కొందరికీ కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా సత్వర న్యాయం చేసే సాయం చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీఆర్పీ రేటింగ్ లో ఒకే కాన్సెప్ట్ తో వస్తున్న కార్యక్రమాలు అభాసుపాలు అవుతున్నాయి. ప్రస్తుతం ఓ ప్రముఖ టీవీ చానెల్ లో ప్రసారం అవుతున్న బతుకు జట్కా బండి ప్రోగ్రాంపై వినిపిస్తున్న సంచలన ఆరోపణలు ఈ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి.

తమను ‘బతుకు జట్కా బండి’ టీవీ కార్యక్రమానికి రావాలంటూ తరచూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగు చూసింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్న జీవితా రాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శులపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తన కుటుంబ సమస్యను పరిష్కరించాలంటూ జీవితను ఓ మహిళ ఆశ్రయించగా, భర్తను బలవంతంగా షోకి రావాలంటూ బెదిరింపులకు దిగారంట.

బాధితులు చెబుతున్న కథనం ప్రకారం.. పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటోడ్రైవర్. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జ్యోతిని 2005లో వివాహం చేసుకున్నాడు. వీరికి సంపూర్ణ(9) అనే కుమార్తె ఉంది. రెండో కాన్పు సమయంలో జ్యోతి అనారోగ్యం పాలవడంతో బాబు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరూ విడిపోయారు. ఈ సమయంలో భార్య జ్యోతికి కొండ రూ.లక్ష ఇచ్చాడు. ఇటీవల ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమాన్ని చూసిన జ్యోతి తన సమస్య పరిష్కారం కోసం జీవిత రాజశేఖర్‌ను ఆశ్రయించింది. దీంతో జీవిత వ్యక్తిగత కార్యదర్శులు అయిన కిరణ్, మరో మహిళ కలిసి కొండ, అతడి తమ్ముడికి ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా తరచూ ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించారు. వారి బెదిరింపులను రికార్డు చేసిన కొండ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి జీవిత వ్యక్తిగత కార్యదర్శులపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Jeevitha  Assistants  Case  Bathuku Jatka Bandi  TV show  

Other Articles