విశాల్ పైరసీ కామెంట్లపై నిర్మాత మండలి ఆగ్రహం | Vishal's piracy comment puts him in trouble

Vishal s piracy comment puts him in trouble

Vishal's piracy comments, Vishal Producer Council issue, Vishal kalaipuli thanu, kalaipuli thanu Vishal

Hero Vishal's piracy comment puts him in trouble

విశాల్ కామెంట్లపై రచ్చ రచ్చ

Posted: 08/18/2016 12:27 PM IST
Vishal s piracy comment puts him in trouble

నడిగర్ సంఘం ఎన్నికల గెలుపు తర్వాత దూకుడు ప్రదర్శిస్తున్న నటుడు విశాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాన్నే రాజేశాయి. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతల మండలి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా సమస్య వచ్చిందని వారి దగ్గరకు వెళ్తే దానిపై చర్చించకుండా బోండాలూ బజ్జీలు తెప్పించుకుని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారంటూ అసంతృప్తిని వెల్లగక్కాడు. దీంతో నిర్మాతల మండలి విశాల్ పై గరంగా ఉంది.

మండలిలో కొందరి తీరు అస్సలు బాగోలేదు. ఇప్పుడున్న జనమంతా మారిపోవాలనీ కొత్త నీరు వచ్చినప్పుడే మంచి రోజులు వస్తాయంటూ విశాల్ పేర్కొన్నాడు. పైరసీ విషయాన్ని కూడా వారు సీరియస్ గా తీసుకోవడం లేదని, అది ఒక్క నిర్మాతలకే కాదు నటీనటులు, సాంకేతిక నిపుణుల కెరీర్లపై కూడా ప్రభావం చూపుతుందని వివరించాడు. ఇక మండలికి బాగా కాలేలా ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఒక సినిమా విడుదలైన 15 రోజుల తరువాతే డీవీడీలు మార్కెట్లోకి వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పాడు.

దీంతో రంగంలోకి దిగిన నిర్మాతల మండలి విశాల్ క్షమాపణలు చెప్పి తీరాలంటూ పట్టుబడుతోంది. అలాకానీ పక్షంలో భవిష్యత్తులో అతడి సినిమాల విడుదల విషయంలో పంపిణీదారులు సహకరించరని హెచ్చరికలు కూడా జారీ చేసింది. తను చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ వెంటనే స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతల మండలి అధ్యక్షుడు కబాలీ నిర్మాత కలైపులి థాను హెచ్చరించారు కూడా. కానీ, విశాల్ మాత్రం ఆ హెచ్చరికలను లైట్ తీస్కుంటున్నాడు.

కాగా, థానూకి, విశాల్ కబాలి విడుదల సమయంలో చిన్నపాటి చిచ్చు రాజుకుంది. దాని పర్యవసానంగానే థాను ఇలా హెచ్చరికలు జారీ చేశాడని పలువురు విశాల్ కు మద్ధతుగా మాట్లాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  kalaipuli thanu  piracy commen  

Other Articles