ఇరు మురుగన్ ట్రైలర్ విడుదల | Vikram Iru Mugan trailer released

Vikram iru mugan trailer released

Chiyan Vikram Iru Mugan trailer, Vikram Iru Mugan trailer, Vikram as RAW agent, Vikram Hijra character, Vikram as Mad scientist, Iru Mugan director, Iru Murugan nithya menon, Iru Murugan nayanatara, Iru Murugan director anand shankar

Chiyan Vikram Iru Mugan trailer released. Vikram stars in double roles as RAW agent and Mad scientist.

ట్రైలర్ : ఇంకోకడు ఇంకో ప్రయోగం

Posted: 08/02/2016 01:24 PM IST
Vikram iru mugan trailer released

సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ప్రయోగాలకు ఏ మాత్రం వెనకాడని హీరోల్లో చియాన్ విక్రమ్ ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటాడు. భారీ బడ్జెట్ అండ్ అంచనాలతో వచ్చిన ఐ చిత్ర ఫలితం ఎలా ఉన్నా ఆ చిత్రం కోసం అతను పడ్డ కష్టాన్ని గుర్తించని వారు ఎవరైనా ఉంటారా? అయితే వరుస ఫ్లాపులు కుంగదీస్తున్న ఈ సమయంలోనే విక్రమ్ ఇరు మురుగన్ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు.

అరిమ నంబీ పేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరు మురుగన్ (తెలుగులో ఇంకోకడు) చిత్ర తమిళ వర్షన్ ట్రైలర్ ఈరోజు రిలీజైంది. ఇందులో విక్రమ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. మలేషియాలో జరిగే ఓ డ్రగ్ రాకెట్ ఆట కట్టించేందుకు భారత్ తరపున వెళ్లే సీక్రెట్ ఏజెంట్ అఖిలన్ పాత్రలో విక్రమ్ నటించనున్నాడు. ఇంకోవైపు అసలు ఆ డ్రగ్ రాకెట్ ప్రధాన సూత్రధారిగా అయిన హిజ్రా పాత్రలో కూడా చియానే నటించడం విశేషం. గతంలో మల్లన్న చిత్రంలో లేడీ గెటప్ లో కాసేపు మాత్రమే అలరించిన విక్రమ్ ఇందులో పూర్తిస్థాయి హిజ్రా పాత్రలో నటించాడు.

ఇక విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ గా నయనతార, అతనికి సహకరించే రా ఏజెంట్ గా నిత్యామీనన్ లు  నటించారు. హ్యారిస్ జైరాజ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. టేకింగ్ కూడా హాలీవుడ్ ప్రమాణాలతో ఉంది. ఏజెంట్ గా రఫ్ లుక్ లో అలరిస్తూనే, ఇంకోవైపు హిజ్రా పాత్రలో పిచ్చి సైంటిస్ట్ గా తనదైన శైలిని చూపించాడు. మొత్తానికి హీరోగా, విలన్ గా విక్రమ్ రెండు పాత్రలో కనిపించడం అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. సెప్టెంబర్ లో రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiyan  Vikram  Iru Mugan  trailer  dual role  nithya menon  nayanatara  anand shankar  

Other Articles