పవన్ కళ్యాణ్ ఓ పుస్తకాల పురుగు అంటున్న సత్యానంద్ | Senior Writer Satyanand about pawan kalyan book reading habit.

Writer satyanand about pawan book habit

Satyanand about pawan kalyan, Senior writer about Pawan Kalyan, Power Star Pawan Kalyan, Pawan Kalyan Habits, Pawan kalyan book reading

Tollywood senior writer Satyanand about pawan kalyan book reading habit.

పవన్ పిచ్చి గురించి ప్రముఖ రచయిత

Posted: 08/02/2016 09:36 AM IST
Writer satyanand about pawan book habit

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైకి రిజర్వుడుగా కనిపించినప్పటికీ ఇండస్ట్రీలో ఆయన సంబంధాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడున్న యంగ్ తరం హీరోలతోనే కాదు, సీనియర్ హీరోలు, ఇండస్ట్రీకి చెందిన సీనియర్ టెక్నిషన్స్ తో ఇప్పటికీ మంచి రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో సీనియర్ రచయిత సత్యానంద్ ఒకరు. చిన్నతనం నుంచే పవన్ గురించి పూర్తిగా తెలిసి ఉన్న ఈయన పవన్ కు ఉన్న ఓ అలవాటు గురించి చెప్పుకొచ్చారు.

పవన్ కు చిన్నప్పటి నుంచీ పుస్తకాలు అంటే మహా పిచ్చి, కొత్త బుక్స్ ఉన్నాయని తెలిస్తే మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసేవాడని అంటున్నాడు. ‘‘ఆరోజుల్లో చిరంజీవిగారి ఇంటికి స్టోరీ చర్చల కోసం తాను తరచుగా వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో సైలెంట్ గా కూర్చుని పవన్ కల్యాణ్ కనిపించేవాడట. పలకరిస్తే మాట్లాడేవాడనీ, ఒకవేళ పుస్తకాల గురించి చర్చ మొదలుపెడితే ఎంతో ఆసక్తిగా వినేవాడని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు తన ఇంట్లో పుస్తకాల కలెక్షన్ కోసం అప్పుడప్పుడూ పవన్ ఆయన ఇంటికి వెళ్లేవాడంట. ఏదైనా పుస్తకం ఇస్తే అక్కడే కూర్చుని చదివేసేవాడని చెప్పారు. అంతేకాదు ఒక్కోసారి పవన్ తో వాకింగ్ కి వెళ్లినప్పుడు పుస్తకాల గురించి - రచనల గురించి తన అభిప్రాయాలను ఎంతో చక్కగా వ్యక్తీకరించేవాడు అని మెచ్చుకున్నారు. పదిహేడేళ్ల వయసులోనే పవన్ కి పుస్తకాల పట్ల అంత ఆసక్తి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేదని సత్యానంద్ చెప్పుకొచ్చారు.

ఇది చిన్నప్పుడే అనుకుంటే పొరపాటు. ఇప్పటికీ ఆయన తరచూ ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ మధ్యనే గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పవన్ చదివారట! అది ఆయనకి చాలాబాగా నచ్చేయటంతో ఆ పుస్తకాన్ని పునర్ముద్రించేందుకు ప్రయత్నిస్తున్నారంట. ఇప్పుడున్న నటీనటుల్లో కాస్త సమయం దొరికితే చాలూ ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్కు లంటూ సోషల్ మీడియాలలో తలలు దూర్చేసేవారే తప్ప, ఇలా ఓపికగా పుస్తకం పట్టుకుని కనిపించేవారు ఎందరుంటారు చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Power Star  Pawan Kalyan  Writer  Satyanand  Book reading  habit  

Other Articles