రజనీకాంత్ కబాలి ఇంట్రడక్షన్ సీన్ లీక్ | Kabali rajanikanth Introduction Scene Leaked

Rajanikanth kabali introduction scene leaked

rajanikanth Introduction Scene Leaked, kabali jail intro scene, kabali introduction scene leak, Kabali jail scene, rajani jail scene, Kabali jail scene

Kabali rajanikanth Introduction Scene Leaked

కబాలి రజనీ ఇంట్రడక్షన్ జైలు సీన్ వీడియో చూస్తారా?

Posted: 07/21/2016 10:33 AM IST
Rajanikanth kabali introduction scene leaked

కబాలి ఆన్ లైన్ లీకేజీల విషయం ఏమో గానీ, లీకేజీ రాయుళ్ల ప్రతాపానికి మాత్రం రజనీకాంగ్ ఇంట్రడక్షన్ సీన్ నెట్ లో దర్శనమిస్తోంది. దాదాపు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ లో రజనీకాంత్ జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలున్నాయి. నీలిరంగు దుస్తుల్లో ఉన్న రజనీకాంత్, జైలు నుంచి బయటకు వస్తూ తన దుస్తులు, షూస్ తదితరాలు తీసుకోవడం, సహచరుల చేతులను ప్రేమగా తాకుతూ నడవటం వంటి దృశ్యాలు ఇందుకో కనిపించాయి.

ఇక ఇందులో జైలు నుంచి బయటకు వచ్చే రజనీ పక్కనే నడుస్తున్న ఓ పోలీసు అధికారి చెబుతున్న డైలాగులివి. "ఇక్కడే ఉండి మరణించకుండా బయటకు వెళుతున్నావంటే అదృష్టవంతుడివి. ఈమధ్యే 40 మంది ఎన్ కౌంటర్ లో పోయారు. అందులో 30 మంది తమిళులే. ఇక్కడి నుంచి వెళ్లే నువ్వు ఇక విలన్ వే" అని అంటాడు. అంతకుముందు, జైల్లోని మరో ఖైదీ "రెండే నెలలన్నా... నేను బయటకు వస్తాను. నా తలే నీకోసం ఇస్తాను. నేనూ బయటకు వస్తాను" అని జైల్లో రజనీ తోటి ఖైదీ చెబుతున్న డైలాగు కూడా ఉంది.

విదేశాల్లో చిత్ర ప్రదర్శన కోసం ముందే ప్రింట్స్ పంపడం జరుగగా, అరబిక్ సబ్ టైటిల్స్ ఈ సీన్ లో కనిపిస్తుండటంతో, ఏదైనా గల్ఫ్ దేశంలో సినిమా సీన్స్ లీక్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఇది రజనీ ఇంట్రడక్షన్ సీన్ గా భావిస్తున్న అభిమానులు తినే ముందు రుచి చూస్తున్నట్టుందని సంబరపడుతున్నారు. ఆన్ లైన్లో కనిపిస్తున్న రజనీకాంత్ 'కబాలి' ఇంట్రడక్షన్ సీన్ లోని ఓ డైలాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలైన వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితరాల్లో శరవేగంగా దూసుకెళుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  rajanianth  Kabali  Intro scene  jail  

Other Articles