మరో నటుడు మెగా ఫోన్ పడుతున్నాడు | Actor Narasimha turns director

Tollywood actor narasimha turns director

Actor Narasimha turns director, Prabhas friend director

tollywood Actor Narasimha turns director.

దర్శకుడి అవతారం ఎత్తనున్న ప్రభాస్ ఫ్రెండ్

Posted: 07/15/2016 03:06 PM IST
Tollywood actor narasimha turns director

మరో నటుడు మెగాఫోన్ పట్టి దర్శకుడి అవతారం ఎత్తనున్నాడు. యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ సినిమా గుర్తుంది కదా. అందులో మందు కోసం పాకులాడే ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో అలరించాడు నటుడు నరసింహ. నచ్చావులేలో తనీష్ పక్కన హస్యం పండించడంతోపాటు మరికొన్ని చిత్రాల్లో కామెడీ రోల్స్ నటించాడు. ఇక ఈ నటుడు అయిన త్వరలో దర్శకునిగా మారబోతున్నాడు.

ఈ మధ్య గుంటూరు టాకీస్ సినిమాలో కామెడీ హీరో పాత్రలో అలరించిన షార్ట్ ఫిల్మ్ కుర్రాడు సిద్దు జోన్నలగడ్డ హీరోగా తెరకెక్కించబోయే చిత్రానికి నరసింహ దర్శకత్వం వహించబోతున్నాడు. రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్త మావ చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ రెడ్డి ప్రొడక్షన్ హౌస్ దీనిని నిర్మించబోతున్నారంట. రోమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుపుకోంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narasimha  Prabhas  Friend  Darling  Sidhu Jonnalagadda  

Other Articles