మొదటి రోజు బాస్ మొదలెట్టాడు | Chiranjeevi 150th Movie Shoot start

Chiranjeevi 150th movie shoot start

Mega Star Chiranjeevi, Chiranjeevi 150 first day shoot, 150th Movie Shoot started, 150 మొదలుపెట్టిన చిరు, చిరు 150 ప్రారంభం, చిరు 150 ఫస్ట్ డే షూట్, తాజా వార్తలు, చిరంజీవి 150 వార్తలు, కత్తిలాంటోడు ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ డే షూటింగ్ లో చిరు కత్తి, కత్తి ఫస్ట్ డే, చిరంజీవి 150

Mega Star Chiranjeevi 150th Movie Shoot started.

మొదటి రోజు బాస్ మొదలెట్టాడు

Posted: 06/23/2016 04:45 PM IST
Chiranjeevi 150th movie shoot start

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మధురక్షణాలు రానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ ప్రారంభమైపోయింది. గురువారం ఉదయం మెహదీపట్నం ప్రాంతంలోని ఓ పాత భవంతిలో సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు.

తొలిరోజు షూటింగ్ లో చిరుతోపాటు కమెడియన్ ఆలీ కూడా పాల్గొన్నాడు. విజువల్స్ బయటకు రానీయకపోయినప్పటికీ తనయుడు రాంచరణ్ కొన్ని స్టిల్స్ తన అఫీషియల్ ఫేస్ బుక్ లో రిలీజ్ చేశాడు. ఈ ఫోటోలలో ఆయన స్టైలిష్ లుక్ తో చింపేశాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత సోలో హీరోగా తెరపై సందడి చేయబోతన్న చిరు మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నాడు.

ఏ తమిళ బ్లాక్ బస్టర్ కత్తి కి కాస్త కామెడీ టచ్ ఇస్తూ తీయబోతున్నాడు మాస్ డైరక్టర్ వివి వినాయక్. ఈ చిత్రానికి చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్ తమ పదునైన మాటలను అందిస్తుండగా, రాకింగ్ స్టార్ దేవీశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఆర్ట్ డైరక్టర్ తోటతరణి, సినిమాటోగ్రఫీ రత్నవేలు కత్తిలాంటోడు కోసం టెక్నిషియన్లుగా పనిచేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇన్నాళ్లూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న చిరు ఎట్టకేలకు మొదలుపెట్టేసరికి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

భాస్కర్

Related Galleries:

Chiranjeevi 150th Film Shooting Spot

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega Star 150  Chiranjeevi 150 movie  

Other Articles