mollywood heroines craze in tollywood

Mollywood heroines craze in tollywood

mollywood heroines, malayalam actress, nayana tara, asin, priyamani, anupama, parvathi menon, keerthi suresh, nivedha thomos, pallavi, sai pallavi

mollywood young actress coming very fast in tollywood industry. they acting only performance role in telugu movies with young heros.

ముద్దొస్తున్న మాలీవుడ్ అందాలు...!

Posted: 06/23/2016 02:48 PM IST
Mollywood heroines craze in tollywood

రీసెంట్ గా వచ్చిన అ-ఆ సినిమాలో నితిన్ సరసన జతకట్టి అందరి చూపులను ఆకర్షించింది అనుపమా పరమేశ్వరన్. పల్లెటూరి గెటప్ లో అచ్చం పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపించింది. ఫస్ట్ సినిమానే అయినా కూడ విమర్శకులను సైతం మెప్పించింది. ప్రస్తుతం ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య సరసన తన నటనతో మరోసారి మెప్పించేందుకు రెడీ అయిపోయింది.

రామ్ సరసన నేను శైలజ అంటూ పలకరించిన కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో , తమిళంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. గ్లామర్ పాత్రలకు నో చెప్పిన ఈ చిన్నది తమిళంలో ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న తోడారి సినిమాలో మేకప్ లేకుండా యాక్ట్ చేసి అందర్ని ఆకర్షిస్తోంది.

ఇక ప్రేమమ్ సినిమాతో ఫేమస్ అయిన మరో అమ్మడు సాయి పల్లవి వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయింది. ఈ సినిమాతో టాలీవుడ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఈ చిన్నది.

జెంటిల్ మెన్ సినిమాలో నాని సరసన నటించిన నివేదా థామస్ తెలుగు ఆడియన్స్ ని కట్టిపారేసింది. మోడ్రన్ డ్రెస్సుల్లో అందంగా కనిపిస్తూనే తన నటనతో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాకోసం ఈ అమ్మడు తెలుగు నేర్చుకుని మరీ యాక్ట్ చేసింది.

ఇప్పుడు నాగచైతన్య ప్రేమమ్ సినిమాతోనే మరో భామ కూడా టాలీవుడ్‌ కి పరిచయం కాబోతోంది. ముద్దుగా, బొద్దుగా ఉండే సెబాస్టియన్‌ త్వరలో తన నటనా విశ్వరూపాన్ని చూపిస్తానంటోంది.

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దల్ఖార్ సల్మాన్ తో చార్లి సినిమాలో జతకట్టిన పార్వతి మీనన్ కూడ తెలుగులో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉంది. బెంగుళూర్ డేస్ రీమేక్ సినిమాలో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malayalam heroines  sai pallavi  keethi suresh  nivedha thomos  parvathi menon  

Other Articles