నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అఖండ భారతావనిని పరిపాలించిన తొలి తెలుగు రాజైన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమే బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మొరాకోలో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసారు. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించబోయే హీరోయిన్ కోసం గతకొద్ది రోజులుగా వార్తలొస్తూనే వున్నాయి. చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ వారెవరూ కాదని తేలిపోయింది. కానీ చివరకు ఓ స్టార్ హీరోయిన్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది.
తెలుగు, తమిళంలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న బ్యూటీ శ్రియను బాలయ్య సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది. శ్రియ అయితేనే ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో సెట్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా భావిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో బాలయ్య-శ్రియ కలిసి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో జోడికట్టారు. మళ్లీ ఇంతకాలం తర్వాత ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’లో జోడికట్టనున్నారు.
ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే బాలయ్య తన లుక్ ను టోటల్ గా మార్చేసారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ఓ ఛాలెంజ్ గా తీసుకుని తెరకెక్కించబోతున్నారు. విజువల్స్ వండర్ గా భారీ గ్రాఫిక్స్ తో ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బిబో శ్రీనివాసరావు సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి రచనా సహకారం - భూపతిరాజా; మాటలు - సాయిమాధవ్ బుర్రా; పాటలు - సిరివెన్నెల సీతారామశాస్త్రి; ప్రొడక్షన్ డిజైనర్ - భూపేష్ ఆర్.భూపతి; స్టిల్స్ - జీవన్ రెడ్డి; డి.ఓ.పి - జ్ఞానశేఖర్ వి.ఎస్; ఫైట్స్ - రామ్,లక్ష్మణ్; డాన్స్ - బృంద; ఎడిటింగ్ - సూరజ్; సంగీతం - దేవిశ్రీప్రసాద్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కొమ్మినేని వెంకటేశ్వరరావు; నిర్మాతలు - వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు; రచన - దర్శకత్వం - జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్).
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more