నో కొట్టుడు.. ఓన్లీ పవనోపదేశం | Shakalaka Shankar misbehavior rumors

Shakalaka shankar misbehavior rumors

Shakalaka Shankar misbehavior rumors, Shakalaka Shankar slaped by pk, Shakalaka Shankar over action, Shakalaka Shankar in sardaar, Shakalaka Shankar videos, Shakalaka Shankar comedy, Shakalaka Shankar

Shakalaka Shankar misbehavior rumors: Telugu Comedian Shakalaka Shankar talks about his misbehavior rumors.

నో కొట్టుడు.. ఓన్లీ పవనోపదేశం

Posted: 05/28/2016 01:43 PM IST
Shakalaka shankar misbehavior rumors

తెలుగు కమెడియన్ షకలక శంకర్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్ సమయంలో వెకిలి వేషాలు వేయడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతడి చెంప చెళ్లుమనిపించాడని అప్పట్లో రకరకాల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో అందరిపై కుళ్లు జోకులు వేయడం, వెటకారాలు చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ చేతిలో తన్నులు తిన్నాడని వార్తలొచ్చాయి. కానీ అలాంటివేమి జరగలేదని షకలక శంకర్ స్పష్టం చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాలా సంధర్భాలలో షకలక శంకర్ నిరూపించుకున్నాడు. షకలక శంకర్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ నచ్చి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అలాంటిది పవన్ కళ్యాణ్ తనను కొట్టాడని వస్తున్న వార్తలపై షకలక శంకర్ ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లో తాను ఓవర యాక్షన్ చేసిన మాట నిజమేనని.. అయితే అందుకు పవన్ కళ్యాణ్ గారు తనను పిలిచి అందరితో ఎలా వుండాలో చెప్పి, మరోసారి అలా చేయవద్దని చిన్న వార్నింగ్ ఇచ్చి పంపించేసారని షకలక శంకర్ తెలిపారు. కేవలం వార్నింగ్ మాత్రమే ఇచ్చారు కానీ తనపై పవన్ కళ్యాణ్ చేయి చేసుకోలేదని షకలక శంకర్ స్పష్టం చేసాడు.

అయితే తన ప్రవర్తన విషయంలో చాలా మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు చాలాసార్లు క్లాసులు పీకారని.. అందుకే ఇక నుంచి పూర్తిగా మారి, అందరితో సరైన విధంగా వుంటూ కెరీర్ దృష్టిపెట్టాలనుకొని నిర్ణయించుకున్నట్లుగా షకలక శంకర్ చెప్పుకొచ్చాడు. మరి ఇంత బాగా క్లారిటీ వచ్చిన తర్వాత కూడా షకలక శంకర్ పై రుమార్లు వస్తాయో లేక ఆగిపోతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakalaka Shankar  Pawan kalyan  Sardaar Gabbarsingh  

Other Articles