అదే సౌండ్ తో వస్తున్న ‘సరైనోడు’ | Sarrainodu Release In Dolby Atmos Sound

Sarrainodu release in dolby atmos sound

Sarrainodu Movie To Release In Dolby Atmos, Sarrainodu Movie theaters list, Sarrainodu Movie in karnataka, Sarrainodu Movie promotions, అల్లు అర్జున్, సరైనోడు, రకూల్ ప్రీత్ సింగ్, Sarrainodu in banglore, Sarrainodu as Yodhuvu, Sarrainodu Trailers, Sarrainodu Movie Tickets, Sarrainodu Movie Online Bookings, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, ఫోటోలు, Sarrainodu Movie USA Theaters list, Sarrainodu Movie Posters, Sarrainodu Movie stills

Sarrainodu Release In Dolby Atmos Sound: Stylish star allu arjun latest film Sarrainodu will be release on 22 April. Boyapati Srinu Director, Thaman music, Rakul preet singh heroine.

అదే సౌండ్ తో వస్తున్న ‘సరైనోడు’

Posted: 04/21/2016 12:44 PM IST
Sarrainodu release in dolby atmos sound

తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ‘భద్ర’, ‘తులసి’, ‘సింహా’, ‘లెజెండ్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సరైనోడు’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

‘సరైనోడు’ టాక్ ఇదేనట!

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు. బన్నీకి మలయాళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. అక్కడ మల్లు అర్జున్ గా బన్నీ పాపులర్. అందువల్ల ‘సరైనోడు’ చిత్రాన్ని మలయాళంలో ‘యోధవు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈరోజు బెంగళూరులో ‘యోధవు’ ప్రమోషన్ కార్యక్రమాల్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. కర్ణాటక ప్రాంతానికి సంబంధించి ‘సరైనోడు’ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దాదాపు 7 కోట్లకు అమ్మడుపోయాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. అక్కడ బన్నీకి ఎలాంటి క్రేజ్ వుందనేది.

‘సరైనోడు’ను టెన్షన్ పెడుతున్న ‘దమ్ము’

‘సరైనోడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకొనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అలాగే యూఎస్‌లో సుమారు 200 థియేటర్లలో ‘సరైనోడు’ సందడి చేయనున్నాడు. ఈ రేంజులో ‘సరైనోడు’ విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఇక తొలిరోజే కలెక్షన్ల రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈమధ్య వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలన్నీ కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ టెక్నాలజీతోనే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలు డాల్మీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ టెక్నాలజీతో విడుదలయ్యాయి. అయితే ‘సరైనోడు’ చిత్రాన్ని కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్సాలజీతో రూపొందించారు. ఇక థియేటర్లలో డాల్మీ అట్మాస్ తో సరైనోడు సందడి మరింత జోష్ గా వుండనుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. బన్నీ డైలాగ్ డెలివరీ, లవ్, కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. నటుడు శ్రీకాంత్, ఆది పినిశెట్టిలు ముఖ్య పాత్రలలో నటించారు. హీరోయిన్ అంజలి ‘బ్లాక్ బస్టర్...’ అనే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాట ప్రస్తుతం టాప్ 5లో స్థానం దక్కించుకుంది. కమర్షియల్ లవ్, మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘సరైనోడు’ చిత్రం ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarrainodu  Allu Arjun  Rakul Preeti Singh  

Other Articles